కేంద్రం గొప్ప స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో ప్రతి నెలా చేతికి రూ. 20 వేలు.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంతొస్తుంది?

Wait 5 sec.

: సంపాదించే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అదే వయసు పైబడిన సమయంలో.. రిటైర్ అయ్యాక.. ఉద్యోగం చేయక నెలనెలా ఆదాయం రాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం మంచిది. అయితే.. అప్పుడు కుదరకపోతే.. అలా పొదుపు చేసిన మొత్తాన్ని సీనియర్ సిటిజెన్లు కూడా కొన్ని ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరంగా ఆదాయం పొందొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. రిస్క్ లేకుండా.. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి అందుకోవచ్చు. ఇక్కడ సీనియర్ సిటిజెన్లు పెద్దగా రిస్క్ కోరుకోరు. వీరికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటుగా.. బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.ఇక్కడే మనం పోస్టాఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజెన్లకు అందుబాటులో ఉన్నటువంటి.. గురించి చూద్దాం. ఇది చాలా వరకు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కూడా అధిక వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. సుకన్య సమృద్ధితో పాటుగా దీంట్లోనే అధిక వడ్డీ ఉంది. ఇక్కడ వడ్డీ రేట్లు ప్రతి నెలలకు ఓసారి కేంద్రం సమీక్షిస్తుంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు. ప్రస్తుతం ఏప్రిల్- జూన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల్ని చూద్దాం.సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ విషయానికి వస్తే ఇది ఐదేళ్ల కాల పరిమితితో కూడిన పోస్టాఫీస్ పథకం. తర్వాత మూడేళ్ల వ్యవధితో పొడిగించుునే అవకాశం కూడా ఉంటుంది. కనీసం రూ. 1000 పెట్టుబడితో ఈ పథకం ప్రారంభించొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలుగా ఉంది. అంటే రూ. 1000 నుంచి రూ. 30 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిశాక మొత్తం పెట్టుబడి డబ్బులు కూడా చేతికి వస్తాయి.నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితికి.. ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ అందుతుంది. 60 ఏళ్లు పైబడిన వారే ఇందులో చేరేందుకు వీలుంటుంది. వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఒక్కసారి రూ. 5 లక్షలు జమ చేస్తే.. ప్రతి 3 నెలలకు రూ. 10,249 వడ్డీ వస్తుంది. ఇక్కడ నెలకు రూ. 3 వేలకుపైనే వస్తుంది. మొత్తం మెచ్యూరిటికీ రూ. 7.05 లక్షలు వస్తాయి.గరిష్ఠ పెట్టుబడి అయిన రూ. 30 లక్షలు జమ చేస్తే.. ప్రతి 3 నెలలకు ఓసారి రూ. 61,499 వడ్డీ అందుతుంది. ఇక్కడ నెలనెలా రూ. 20,500 వరకు అందుతుంది. మొత్తం వడ్డీ ప్రయోజనం రూ. 12.30 లక్షలుగా ఉంటుంది. అంటే మెచ్యూరిటీ వాల్యూ రూ. 42.30 లక్షలు అవుతుంది.