22k Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు దానికి బ్రేక్ పడింది. జూన్ 9న ఒక్కసారిగా ధరలు ఎగబాకాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్థిరంగానే ఉన్నప్పటికీ.. దేశీయంగా ధరలు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1350 పెరిగింది. దీంతో తులం పసిడి ధర ఇప్పుడు రూ. 1,40,400 కు చేరింది. దీనికి ముందు చూస్తే వరుసగా రూ. 950, రూ. 2750, రూ. 350, రూ. 100, రూ. 750 ఇలా గత 10 రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. అంటే ఇప్పుడు దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధరలు పెరిగాయన్నమాట. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే హైదరాబాద్ నగరంలో రూ. 1470 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,53,160 వద్ద ట్రేడవుతోంది. ఇది గత 10 రోజుల వ్యవధిలో రూ. 5 వేలకుపైగా తగ్గిందని చెప్పొచ్చు. బంగారం ధరలు పెరిగినప్పటికీ మరోవైపు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు కేజీకి రూ. 2.70 లక్షల వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. వెండి ధర చూస్తే చాలా రోజులుగా పెరగకుండా స్థిరంగానే ఉంటూ వస్తోంది. జూన్ 4, 5, 6 తేదీల్లో కలిపి రూ. 20 వేల మేర తగ్గడం విశేషం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. కిందటి రోజుతో పోలిస్తే పెద్దగా మారలేదు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4330 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు చూస్తే 68 డాలర్ల వద్దే ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించి రూ. 95.65 వద్ద ఉంది. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు ప్రధాన కారణం క్రూడాయిల్ ధరలు తగ్గడం. అవును.. గత 2 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరగ్గా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ చేసుకున్నాయి. దీంతో క్రూాడాయిల్ ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లకు దిగొచ్చింది. సాధారణంగానే క్రూడాయిల్ ధరలు తగ్గితే.. బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు అదే జరిగింది.