భారత్‌లో కార్ల ధరలు పెంచుతోన్న దిగ్గజ కంపెనీ.. జులై 1 నుంచే అమలు.. ఎంత పెరగనుందంటే?

Wait 5 sec.

Car Price: మన దేశంలో ప్రయాణికుల వాహనాల మార్కెట్ మంచి స్థానంలో ఉంది. ముఖ్యంగా గత మే నెలల కార్ల విక్రయాలు భారీగా జరిగాయి. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ ప్రముఖ కంపెనీలు సైతం తమ సేల్స్ పెంచుకున్నాయి. అయితే ఒక్కో సంస్థ ధరల పెంపు వైపు వెళ్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు మారుతీ సుజుకీ, హ్యూందాయ్ మోటార్స్ సహా దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా ఇప్పుడు మరో కంపెనీ అదే దారిలో నడుస్తోంది. తమ పోర్ట్‌ఫోలియోలని కార్ల ధరలను పెంచుతున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తాజాగా ప్రకటన చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తాజా ప్రకటన ప్రకారం బీఎండబ్ల్యూ (BMW), మినీ వెహికల్ పోర్ట్ ఫోలియో ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన ధరలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి అయిన వాహనాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అన్ని వేరియంట్లకూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేయడం మంచిది. ఎందుకుంటే జులై 1, 2026 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. అలాగే ఈ 2026లో ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. దేశంలో ఏ మోడల్స్ విక్రయిస్తున్నారు?, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ధరలు పెంచాల్సి వస్తోందని బీఎండబ్ల్యూ గ్రూప్ సీఈఓ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. భారత్‌లో బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 7 సిరీస్ ఎక్స్1, ఎక్స్ 3, ఎక్స్ 5, ఎక్స్ 7, ఎం 340ఐ, ఐఎక్స్ 1 లాంక్ వీల్ బేస్ మోడళ్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ మోడల్ కార్లయను స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నామని, ధరల పెంపు వీటిపై ప్రధానంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఐ5, ఎం 60, ఐ 7, ఐ 7 ఎం 70, బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఎం440 ఐ కన్వర్టబుల్, ఎం2 కూపే, ఎం 4 కాంపిటీషన్, ఎం5, ఎక్స్ఎం మోడళ్లను విదేశాల్లో తయారు చేసి దేశీయంగా విక్రయిస్తున్నామని చెప్పారు.