మ్యాచ్ మధ్యలో స్మృతి మంధానకు పీరియడ్స్.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన స్టార్ బ్యాటర్!

Wait 5 sec.

టీమిండియా ఉమెన్స్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. టెస్టు మ్యాచ్ మధ్యలో తనకు పీరియడ్స్ వచ్చిన అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే మానసిక, శారీరక సవాళ్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి విషయాన్ని బయటకు మాట్లాడేందుకు చాలా మంది వెనుకంజ వేస్తుంటారు.. అలాంటిది స్మృతి మంధాన ధైర్యంగా పంచుకోవడంతో అందరూ అభినందిస్తున్నారు. పీరియడ్స్ వచ్చిన సమయంలోనూ పిచ్ నుంచి బయటకు వెళ్లకుండా ఆడానని, తాను భారత జట్టుకు ఆడుతున్నానని.. దేశం కోసం ఆడుతున్న సమయంలో కొన్నిసార్లు పీరియడ్స్ నొప్పి కూడా ఆ బాధ్యతకు అడ్డుకాదంటూ స్మృతి మంధాన చెప్పింది. ఆ సమయంలో అంపైర్ అర్థం చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయమేనని స్మృతి వెల్లడించింది. "నేను భారత జట్టుకు ఆడుతున్నాను. అదే ఆలోచన నన్ను ముందుకు నడిపించింది. జెర్సీ ధరించిన తర్వాత మనకు అప్పగించిన బాధ్యతను కరెక్ట్‌గా నిర్వర్తించాలి. కొన్నిసార్లు పీరియడ్స్ నొప్పి కూడా ఆ బాధ్యతకు అడ్డుకాదు. ఆ సమయంలో అంపైర్ దగ్గరకు వెళ్లి ఇప్పటి వరకు నేను చేసిన విచిత్రమైన రిక్వెస్ట్ కూడా ఇదే కావొచ్చు. ప్యాడ్ వేసుకోవాలని అని చెప్పాను. వైట్ జెర్సీ ధరించడంతో అంపైర్ కూడా అర్థం చేసుకుని అనుమతి ఇచ్చారు" అని స్మృతి మంధాన వెల్లడించింది. ఆ రోజు ఏకంగా పది నిమిషాల పాటు టెస్టు మ్యాచ్ నిలిచిపోయిందని.. తాను ముందుగా ఆ విషయాన్ని తన నాన్ స్ట్రయికర్ బ్యాటర్‌కి చెప్పానని.. ఆ వెంటనే అంపైర్‌కి చెప్పడంతో.. అంపైర్ కూడా వెంటనే వెళ్లాలని సూచించిందని స్మృతి మంధాన చెప్పింది. స్మృతి మంధాన రివీల్ చేసిన ఈ విషయం ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎదురయ్యే క్షణమని, ప్రతి సందర్భంలోనూ ధైర్యంగా ముందుకు సాగాలని చూయించింది. స్మృతి తన కెరీర్‌తో పాటు జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ రోజున ప్రపంచం గర్వించదగ్గ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.