నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ (NCP-SP) తిరిగి కాంగ్రెస్‌లో విలీనం కానున్నాయా? ప్రస్తుతం టీఎంసీలో నెలకున్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకున్న నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీలు ఖండించాయి. తృణమూల్ విలీనంపై వార్తలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఖండించారు. ఎలాంటి ఆధారాల్లేని పుకార్లని ఆయన కొట్టిపారేసినప్పటికీ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత నానా పటోలే మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.నానో పటేలా వాదనసారూప్యత కలిగిన పార్టీలు కాంగ్రెస్‌లో విలీనానికి సిద్ధమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌లో విలీనం కావడానికి మమతా బెనర్జీ, శరద్ పవార్‌లు తమ మనసులను సిద్ధం చేసుకుంటున్నారు’’ అన్నారు. ఇది కేవలం పొత్తు కాదు కానీ, విలీనం అని ఆయన నొక్కిచెప్పారు. ఎన్సీపీ-ఎస్పీ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలను శరద్ పవార్ ఇప్పటికే ఇచ్చారని, ఆ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోందని ఆయన చెప్పారు. ‘‘శరద్ పవార్ ముందే ప్రతిపాదన తెచ్చారు.. కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది..దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే... లౌకిక, బహుళత్వ సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ ఓట్ల చీలికను అడ్డుకోడానికి ఏకం కావాలని నేను భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.సంజయ్ రౌత్ పిలుపుఇక, శివసేన (యూటీబీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ సైతం రెండు రోజుల కిందట ఇటువంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడిన చిన్న పార్టీలను తిరిగి విలీనం చేసే విషయంలో శరద్ పవార్ 'ముందుండి నడిపించాలని' సంజయ్ రౌత్ కోరారు. ‘‘కాంగ్రెస్ బలంగా ఉండాలి, దాని నుంచి పుట్టిన చిన్న పార్టీల నాయకులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి’’ అని రౌత్ అన్నారు.దీనిపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందిస్తూ 'మంచి ప్రతిపాదన' అని, ఆ తర్వాత ఏం జరుగుతుందో కాలమే చెబుతుందని అన్నారు. రౌత్ ప్రతిపాదనను తిరస్కరించకుండా ‘‘ముందు వర్షం పడనీ, అప్పుడు గొడుగు తీసుకోవాలో, రెయిన్‌కోట్ తీసుకోవాలో చూద్దాం’’ అని ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మద్దతుఇక, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కూడా సంజయ్ రౌత్ చెప్పినట్టు చిన్న పార్టీలు కాంగ్రెస్‌లో విలీనమై రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ‘‘సంజయ్ రౌత్ చెప్పిన దాంట్లో సారం ఉంది. సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలుగా మారిన పార్టీలన్నీ తిరిగి కలవాలి, రాహుల్ గాంధీని తమ నాయకుడిగా మనస్ఫూర్తిగా అంగీకరించాలి’’ అని గెహ్లాట్ అన్నారు.‘‘ఇండియా కూటమికి నాయకుడు రాహుల్ గాంధీ అనే సందేశం దేశవ్యాప్తంగా వెళ్లాలి. ఈ సందేశం స్పష్టంగా ఉండాలి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. ఒకవైపు నరేంద్ర మోదీ, మరోవైపు రాహుల్ గాంధీ ఉన్నారని వారు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాహుల్ గాంధీని తమ నాయకుడిగా అంగీకరించాయనే స్పష్టమైన సందేశం వెళితే, దేశంలో ఓటింగ్ సరళి మారడాన్ని మీరు చూస్తారు’’ అని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.గతం.. వర్తమానంశరద్ పవార్, మమతా బెనర్జీ‌లు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంతంగా రాజకీయ పార్టీలను ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌తో విబేధించి 98లో తృణమూల్ కాంగ్రెస్‌ను మమతా బెనర్జీ, 99లో నేషనలిస్ట్ కాంగ్రెస్‌ను శరద్ పవార్ స్థాపించారు. సోనియా గాంధీ ‘విదేశీయత అంశం’ లేవనెత్తడంతో పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లను కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ ముగ్గురూ కలిసి ఎన్సీపీని ఏర్పాటుచేయగా.. కొన్నాళ్ల తర్వాత తారిఖ్ అన్వర్ సొంతగూటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం టీఎంసీ మాదిరిగానే 2023లో ఎన్సీపీ సంక్షోభం ఎదుర్కొంది. శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ నాయకత్వంలో తిరుగుబాటు చేయడంతో పార్టీ చీలిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీ పేరు, గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఆ తర్వాత మహారాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ-శివసేన కూటమితో జతకట్టారు.ఈ వారం ఆరంభంలో కాంగ్రెస్, టీఎంసీ నాయకుల మధ్య వరుసగా జరిగిన భేటీలు ఈ విలీన పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి. మంగళవారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీతో భేటీ కాగా, మర్నాడు దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో తృణమూల్ కాంగ్రెస్ బలమైన కూటమిని కోరుకుంటోందని, ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తాము అంగీకరిస్తున్నామని అభిషేక్ బెనర్జీ చెప్పినట్టు సమాచారం.అయితే, విలీనానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన అయినా టీఎంసీ నుంచే రావాలని, తాము మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.