SBI : మీకు ఏదైనా పని కోసం డబ్బులు అవసరమైతే ప్రస్తుతం చాలా మంది బ్యాంకులో తీసుకువాలనుకుంటున్నారా? దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఇస్తున్నాయి. మీరు బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లోన్ తీసుకోవడంతో పాటు అనువైన తిరిగి చెల్లించే ప్రక్రియను ఎంచుకోవాలి. మీ సామర్థ్యానికి మించి లోన్ తీసుకుంటే నెల నెలా కట్టాల్సిన కిస్తి మీ కు భారంగా మారుతుంది. అది మీ కుటుంబాన్ని అప్పుల్లోకి లాగేస్తుంది. అందుకే ఆన్‌లైన్లో లభించే పర్సనల్ కాలిక్యులేటర్ ద్వారా EMI ఎంత పడుతుందని లోన్ తీసుకునే ముందే తెలుసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రూ.10 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు ఎంత, ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది? అనేది తెలుసుకుందాం. ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా నెల నెల ఎంత మేర ఈఎంఐ పడుతుంది నిర్ణయించుకోవడంతో తమ సామర్థ్యానికి తగినట్లుగా లోన్ అమౌంట్ లేదా రీపేమెంట్ కాల వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఎంత లోన్ తీసుకుంటున్నారు, దానిపై బ్యాంక్ ఎంత వడ్డీ రేటు నిర్ణయించింది, లోన్ తిరిగి చెల్లించే టెన్యూర్ ఎంత అనే వివరాలు అవసరమవుతాయి. బ్యాంకుకు వెళ్లినప్పుడు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాలను పరిశీలించి మీకు ఎంత లోన్ ఇస్తాము, దానిపై ఎంత వడ్డీ అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. దాని ద్వారా మీరు లెక్కగట్టవచ్చు. రూ.10 లక్షల లోన్ తీసుకుంటే ఎంత EMI పడుతుంది?ఇందులో ప్రస్తుతం వడ్డీ రేట్లు 10 శాతం నుంచి మొదలవుతోంది. గరిష్ఠంగా 18 శాతం వరకు విధిస్తున్నారు. లోన్ టెన్యూర్ ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. మీకు 800 ఆపైన క్రెడిట్ స్కోర్ ఉండి, బ్యాంకుతో మీకు మంచి సత్సంబంధాలు ఉంటే కనిష్ఠ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. మీకు బ్యాంకు కనిష్ఠ వడ్డీ రేటు 10 శాతంతో లోన్ ఇవ్వాలని నిర్ణయించింది అనుకుందాం. అప్పుడు ఆన్‌లైన్ ఎస్‌బీఐ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా నెల నెలా ఈఎంఐ ఎంత పడుతుందో తెలుసుకోవచ్చు.మీరు రూ.10 లక్షల లోన్ తీసుకుని 36 నెలల (3 ఏళ్లలో)లో లోన్ తిరిగి చెల్లించే టెన్యూర్ ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు మీకు నెల వారీ ఈఎంఐ రూ.32,267 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు ఈఎంఐ రూ.21,247 వరకు అవుతుంది. 5 ఏళ్ల కాలంలో మొత్తం మీరు చెల్లించే వడ్డీ రూ.2,74,823 వరకు అవుతుంది. అంటే రూ.10 లక్షల లోన్‌ తీసుకుంటే రూ.12,74,823 వరకు కట్టాల్సి వస్తుంది. మీ టెన్యూర్, వడ్డీ రేటు ఆధారంగా మీరు కట్టాల్సిన ఈఎంఐ అనేది మారుతుంది. అలాగే బ్యాంకు మీకు ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.