తెలుగు IAS రోహిణి Vs ఐపీఎస్ రూపా మౌడ్గిల్.. వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Wait 5 sec.

కర్ణాటక క్యాడర్‌కు చెందిన మధ్య కొనసాగుతోన్న వివాదంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో బహిరంగంగా జరిగిన వాగ్వాదం అనంతరం ఈ ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు పరస్పర పరువు నష్టం దావాలు వేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ అత్యుత్తమ అధికారులని, వారు ఒకరి కెరీర్‌ను మరొకరు నాశనం చేసుకుంటున్నారని, ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమించింది. ఈ మేరకు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి గతంలోనే రాజీ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇరువురికీ హితవు పలికింది.‘‘వారిద్దరూ ఒకరి కెరీర్‌ను ఒకరు నాశనం చేసుకుంటున్నారు’’ అని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత కేసులో, ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమిస్తున్నాం.. కక్షిదారులు జస్టిస్ కురియన్ జోసెఫ్ ఎదుట హాజరు కావాలి. మధ్యంతర ఉపశమనంగా ఇరువురి మధ్య ఉన్న రెండు కేసులకు సంబంధించిన తదుపరి విచారణను నిలిపివేయడం జరుగుతుంది’’ అని కోర్టు ఆదేశించింది.2023లో ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా వేసుకున్నారు. మౌడ్గిల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తనపై ప్రారంభించిన పరువు నష్టం దావాను సవాలు చేస్తూ సింధూరి దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.మౌడ్గిల్ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. కింది కోర్టు సరైన నిర్ణయం తీసుకుందని, హైకోర్టు పరిధిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. తనకు ఆపాదించిన వాంగ్మూలాలు ‘సద్భావన’ అనే పరిధిలోకి వస్తాయన్న సింధూరి వాదనలను హైకోర్టు తిరస్కరించింది. ఇంతకు ముందు మౌడ్గిల్ కూడా ఇలాంటి వాదననే లేవనెత్తారని హైకోర్టు గమనించింది. అప్పట్లో ఒక కోఆర్డినేట్ బెంచ్ . 'సద్భావన' అనే అంశం విచారణసమయంలో తేలాల్సిన సాక్ష్యాధారాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.ఇదే సూత్రం ఇరుపక్షాలకూ సమానంగా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పును ప్రస్తావిస్తూ ఒక పక్షానికి విచారణార్హమైన అంశంగా భావించిన విషయం, మరో పక్షానికి విచారణను ప్రారంభ దశలోనే రద్దు చేయడానికి కారణంగా మారకూడదని కోర్టు పేర్కొంది. ఒక ప్రకటన ప్రజా ప్రయోజనం కోసం ఇచ్చారా లేదా అనేది సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ణయించాల్సిన వాస్తవ సమస్యని హైకోర్టు తెలిపింది. అటువంటి అంశాలను విచారణ ప్రాథమిక దశలో పరిశీలించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది.ఐఏఎస్‌ రోహిణిని విమర్శిస్తూ ఐపీఎస్‌ రూపా 2023 ఫిబ్రవరి 18 ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లపై తీవ్ర దుమారం రేగింది. రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్‌ చేసి ... ఐఏఎస్ అక్రమాలు ఇవీ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సింధూరి పరువు నష్టం దావా వేయగా.. దీనిని మౌడ్గిల్ హైకోర్టులో సవాల్ చేశారు.