పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ ఘటనలో 9 మంది చనిపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన గుండెను కలిచివేసిందన్న వైఎస్ షర్మిల.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. "విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ విషాద ఘటన గుండెను కలిచివేసింది. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో, మరుగుతున్న ద్రవ ఉక్కు మీద పడి 9 మంది కార్మికులు సజీవ దహనం అవ్వడం అత్యంత విషాదకరం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఈ అత్యంత దుఃఖభరిత క్షణాల్లో, తీవ్ర ఆవేదనతో ఇదే మా ప్రశ్న.. ఇంకెన్ని ప్రాణాలు బూడిద కావాలి ? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాలి ? విశాఖ ఉక్కుపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడ ఇంకెంత కాలం? ఇదెక్కడి మారణహోమం? 11 ఏళ్లుగా గుండెలు బాదుకుంటున్న కార్మికుల ఘోష మీకు చెవిన పడదా ? ప్లాంట్ వినాశనం ఆపాలని, ఆధునీకరించాలని రాష్ట్రమంతా ఉద్యమాలు జరుగుతుంటే, ప్రైవేటీకరణ చెయ్యాలనే ఆచరణకు, ఆలోచనకు ఆహుతి అయ్యాయి ఇవాళ ఇన్ని అమాయక ప్రాణాలు." అంటూ షర్మిల మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంటులో ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని షర్మిల ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి భాద్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వహించాలని డిమాండ్ చేశారు. తుప్పు పట్టిన యంత్రాల స్థానంలో కొత్తవి సమకూర్చి ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదని షర్మిల విమర్శించారు. "పేరుకే ఉక్కు సంకల్పం.. తెరవెనుక ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. ప్రమాద కారణాలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించి విచారణ చేపట్టాలి. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. " అని షర్మిల డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను షర్మిల డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడే ప్రయత్నాల్లో నిజాయితీ చూపకపోతే తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కోవలసి వస్తుందంటూ షర్మిల హెచ్చరించారు.