రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. మాట్లాడుతూ.. ''పెద్ది ఆడాడు.. పోరాడాడు.. గెలిచాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా టీమ్ మళ్లీ ఆడాల్సి వచ్చింది.. పోరాడాల్సి వచ్చింది. మళ్లీ గెలిచాడు. రెండుసార్లు గెలవడం బహుశా ఇదే మొదటిసారి. 300 కోట్లు, 400 కోట్లు అనేది పక్కన పెడితే.. ఈ సినిమా ఎంత పెద్ద విజయం అనేది 300 రూపాయల టికెట్ కొన్న ప్రేక్షకుడే దాన్ని నిర్ణయిస్తాడు. ఆడియన్స్ చేతిలో అంత పవర్ ఉంది. మనది అలాంటి వల్నరబుల్ ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు ఒక మెగా పవర్ స్టార్‌కి ఈ కథ చెప్పడం, ఈ పాత్రను కన్విన్స్ చేయడం, చరణ్ దాన్ని నమ్మడం, దాన్ని తీయడానికి ప్రొడ్యూసర్ దైర్యంగా ముందుకు రావడం మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయినా జనం తిరస్కరించే అవకాశం ఉంది. అంత రేజర్ ఎడ్జ్ మీద నడిచిన సినిమా ఇది'' అని అన్నారు.''చరణ్ ఈ సినిమాను భుజాల మీద కాదు, నెత్తిన పెట్టుకుని మోశాడు. ఒక రేంజ్ కి వెళ్లాలంటే ఎన్నో దాటాలి. ఆయన పెర్ఫార్మన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇది అన్ బిలీవబుల్. తను ఈ సినిమాకి జస్ట్ మ్యాన్ కాదు.. అతడు సూపర్‌ మ్యాన్, హీ-మ్యాన్. 'పెద్ది' రిలీజైన రెండో రోజు మా కజిన్ ఫోన్ చేసి 'సినిమాలో ఏమీ లేదంట కదా' అన్నది. అదే మనిషి ఇవాళ అల్లు స్టూడియోస్ లో 'హీ-మ్యాన్' అనే సినిమాకి వెళ్లింది. అక్కడ 'పెద్ది'లోని రామ్ చరణ్ పోస్టర్ పక్కన నిలబడి అందరూ ఫోటోలు దిగుతున్నారని నాకు ఫోన్ చేసి చెప్పింది. ‘పెద్ది’ సినిమా ఒక కల్ట్ మారిపోయింది. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది''''ఈ సినిమాకు ఆ రోజు, ఈ రోజు అనే తేడా లేదు. ఏ రోజైనా ‘పెద్ది’ డే. సినిమాకు దమ్ము ఉంది కాబట్టే, ఇంత దూరం వచ్చింది. టీమ్ హార్డ్ వర్క్ చూసి నాకు ముచ్చటేసింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ‘పెద్ది కొట్టేది ప్రతిదీ సిక్సరే’ అని చెప్పాను. అలాగే నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని కూడా చెప్పాను. అప్పుడు ఎక్కువ మాట్లాడానా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు చూస్తుంటే నేను తక్కువే మాట్లాడాననిపిస్తోంది. సినిమా కలెక్షన్లు అదే చెబుతున్నాయి. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోబోతోంది. ఈ సందర్భంగా గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ట్వీట్ చేస్తూ ‘నా బ్రదర్ జగపతిబాబు’ అన్నారు. అది నాకు ఆయన నుంచి వచ్చిన అతిపెద్ద కాంప్లిమెంట్''''ట్రోలర్స్ వల్ల, అపోజిషన్ వల్ల, కిందికి దించేయాలని చూసేవారి వల్లనో ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు ఎంత ఇబ్బంది పడ్డారు.. తపన పడ్డారు అనేది నాకు అర్థమవుతోంది. 'పెద్ది' సినిమా వచ్చాక అందరూ ఊపిరి పీల్చుకుంటారని ముందే చెప్పాను. నిజంగానే ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. 8 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుతమైన పాత్ర ఇచ్చిన బుచ్చిబాబుకి ధన్యవాదాలు. అలాగే నా ఫేవరెట్ హీరో చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ సినిమాని మరింత పెద్ద విజయంగా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను'' అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.