ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి వేదికగా జూన్ 9వ తేదీ జరగాల్సిన సంక్షేమం బహిరంగ సభను వాయిదా వేసింది.నేపథ్యంలో సీఎం నాయుడు సంక్షేమం సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్‌తో చర్చించిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కారుకు రెండేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో మంగళవారం రోజున తిరుపతిలో సంక్షేమం సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితేచోటుచేసుకోవటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్నారు.మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి కావటం.. ఏపీలో కూటమి సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కూటమి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రకారం తిరుపతిలో జూన్ 9న సంక్షేమం సభ తలపెట్టారు. జూన్ 12న పాలనా సంస్కరణలపై అమరావతిలో సభ పెట్టాలని నిర్ణయించారు. అలాగే విశాఖపట్నం వేదికగా జూన్ 15న అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈలోపే స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం జరగటంతో ప్రభుత్వం సంక్షేమం సభను వాయిదా వేసింది. సోమవారం రోజున విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీలో ప్రమాదం జరిగింది. స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ పేలింది. దీంతో లిక్విడ్ ఉక్కు లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయారు. వీరిలో ఐదుగురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాగా.. ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుమరోవైపు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారుల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆఫీసులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గాయపడినవారి వివరాలు తెలుసుకోవడం కోసం 089125 90100, 089125 90102 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలు, ప్రభుత్వ అధికారి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.