ATF Prices: పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో దేశీయంగా తీవ్ర ప్రభావం పడింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను మరో 10 శాతం పెంచుతూ ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు విమాన ఇంధనం ధర లీటరుకు ఢిల్లీలో రు.104.927 వద్ద ఉండగా అది ఇప్పుడు రూ.115కు చేరింది. దీని కింద దేశీయ విమాన కంపెనీలకు 3 సంవత్సరాల పాటు ఏటీఎఫ్ ఇంధనం ధర స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినా దేశీయ విమాన కంపెనీలకు ధరలు మారవు. టికెట్ ఛార్జీల రూపేణ ప్రయాణికులకూ ఊరట కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ధరల స్థిరీకరణ విధానాన్ని ఎంచుకోని విమాన కంపెనీలు మాత్రం, చమురు మార్కెట్‌కు అనుగుణంగా ఏటీఎఫ్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంటే అంతర్జాతీయ విమానయాన కంపెనీల తరహాలో లీటరుకు రూ.142 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు ఈ కంపెనీలకు భారీగా ప్రయోజనం లభిస్తుంది. ఇరాన్ యుద్ధానికి ముందు లీటర్ ఏటీఎఫ్ ధర రూ.60.50గా ఉండేది. ఆ తర్వాత భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతోనే విమాన సంస్థలు, ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త పథకంతో ధరల స్థిరీకరణధరల స్థిరీకరణ పథకాన్ని ఎంచుకున్న దేశీయ విమానయాన కంపెనీలు లీటరుకు రూ.86.32 ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రామాణిక ధర చెల్లించాలి. దీనిపై విమానాశ్రయ ఛార్జీలు, చమురు కంపెనీల మార్జిన్లు, ట్యాక్సులు అన్నీ కలిపి లీటరుకు ఢిల్లీలో రూ.115కు చేరింది. ఇక ముంబైలో ఏటీఎఫ్ ధర రూ.114.50గా ఉంది. చెన్నైలో రూ.139కి చేరింది. దేశీయ విమాన సంస్థలకు 2 నెలలుగా ఏటీఎఫ్ ధర సవరించలేదు. దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టపోతున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు రూ.10 వేల కోట్లతో ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధిని కేంద్రం ప్రతిపాదించింది. ఏటీఎఫ్ లీటరు ప్రామాణిక ధర రూ.86.32 కంటే గ్లోబల్ ధర పెరిగితే కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా ఆయిల్ కంపెనీలకు రుణం ఇస్తుంది. తగ్గినప్పుడు కంపెనీల నుంచి వసూలు చేస్తుంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ వాటా 40-60 శాతం వరకు ఉంటుంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవేఏటీఎఫ్ ధరలు 10 శాతం మేర పెరిగిన క్రమంలో తర్వాత అయితే, వీటి ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.103.82 వద్ద ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.115.64గా, డీజిల్ ధర లీటరుకు రూ.104.34గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21గా ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ. 97.83గా ఉంది. ఢిల్లీలో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ.102.12గా ఉండగా, లీటర్ డీజిల్ రేటు రూ.95.20గా ఉంది.