ITR Scrutiny: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం 2026-27లో కొన్ని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గత ఆర్థిక ఏడాది 2025-26లో ఫైల్ చేసిన రిటర్నులలో ఐటీ శాఖ గుర్తించిన నిర్దిష్ట రిస్క్ పారామితుల ఆధారంగా ఈ తనిఖీలు చేయనున్నారు. ఈ స్క్రూటినీకి సంబంధించి నోటీసులు జారీ చేసేందుకు జూన్ 30,2 026ను గడువుగా నిర్ణయించారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ 6 కేటగిరీల రిటర్నులపై తప్పనిసరి తనిఖీసర్వే పరిధిలోకి వచ్చేవారు: 2024, ఏప్రిల్ 1 తర్వాత ఐటీ శాఖ సర్వే పరిధిలోకి వచ్చిన ట్యాక్స్ పేయర్ల రిటర్నులను సెక్షన్ 133ఏ ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆమోదంతో తప్పనిసరిగా తనిఖీకి ఎంపిక చేస్తారు. ఐటీ దాడులు, శోధనలు: 2024, ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత ఐటీ దాడులు సెక్షన్ 132 ప్రకారం లేదా సెక్షన్ 132ఏ ప్రకారం ఆస్తుల స్వాధీనం ఎదుర్కొన్న వారి రిటర్నులను సంబంధిత అసెసింగ్ ఆఫీసర్ల ముందస్తు అనుమతితో సమగ్రంగా తనిఖీ చేస్తారు. సెక్షన్ 148 కింద నోటీసులు వచ్చినవారు: గతంలో జరిగిన దాడులు, సర్వేల ఆధారంగా లేదా ఇతర పన్ను ఎగవేత సమాచారం వల్ల సెక్షన్ 148 కింద నోటీసులు జారీ అయ్యి, మార్చి 31,2027 లోగా అసెస్మెంట్ పూర్తి కావాల్సిన కేసులు ఈ పరిధిలోకి వస్తాయి. ట్యాక్స్ మినహాయింపు రద్దయిన ట్రస్టులు, సంస్థలు: సెక్షన్ 12ఏ, సెక్షన్ 12ఏబీ, 10 (23సీ) వంటి నిబంధనల కింద రిజిస్ట్రేషన్ దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా మార్చి 31, 2025లోపు రిజిస్ట్రేషన్ రద్దయినా ఐటీఆర్-7లో ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసిన ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల రిటర్నులను కచ్చితంగా తనిఖీ చేస్తారు. గతంలో భారీగా అదనపు ఆదాయం తేలిన కేసులు: గత అసెస్మెంట్ ఇయర్లలో పన్ను లెక్కింపుల్లో తప్పులు దొర్రి మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె వంటి వాటిల్లో రూ.50 లక్షల కంటే ఎక్కువ, ఇతర నగరాల్లో రూ.20 లక్షల కంటే ఎక్కువ అదనపు ఆదాయాన్ని ఐటీ శాఖ నిర్దారించి, అది కోర్టులు, లేదా అప్పీళ్లలో ఐటీ శాఖకు అనుకూలంగా తేలితే అలాంటి వారి ప్రస్తుత రిటర్నులను తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. పన్ను ఎగవేతపై పక్కా సమాచారం ఉన్న కేసులు: ఇతర చట్ట అమలు సంస్థలు, ఇన్వెస్టిగేషన్ వింగ్ లేదా ఇంటెలిజేసన్ ఏజెన్సీల నుంచి పన్ను ఎగవేతకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిన ట్యాక్స్ పేయర్ల అకౌంట్లను తనిఖీ చేయనున్నారు. రూల్స్ మాత్రం చాలా కఠినంగా వర్తింపజేయనున్నారు. ట్యాక్స్ పేయర్లు తమ ఐటీ రిటర్నులలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఆదాయాన్ని దాచకుండా నిజాయితీగా ఫైల్ చేయడం ద్వారా ఇలాంటి కంపల్సరీ స్క్రూటినీ నోటీసుల బారిన పడకుండా ఉండవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే ముందే అన్ని వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది. ఉద్యోగులు అయితే ఫారం 16 జారీ చేసే వరకు వేచి ఉండాలని చెబుతుంటారు.