కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా, యూరప్ వంటి దేశాల్లో జరిగితే "తీవ్ర ప్రమాదాల శిక్ష చట్టాలు" కింద సీఈఓలు, ఎండీలు సహా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంటులో ప్రమాదానికి బాధ్యులైన సీఎండీ, సంబంధిత ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. "విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగినట్లు వేరే దేశాల్లో ప్రమాదం జరిగి ఉంటే మరోలా ఉండేది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కొరియా వంటి దేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. ప్రభుత్వం వెంటనే ప్లాంటును తన అధీనంలోకి తీసుకుంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్లాంటును తన అధీనంలోకి తీసుకుని డేటా మొత్తం సేకరిస్తారు. ప్లాంట్‌ ఎండీని, ఆపరేషన్స్ డైరెక్టర్, సేఫ్టీ ఆఫీసర్లను అరెస్ట్ చేసి లోపల వేస్తారు. ఇక్కడ మాత్రం భద్రతా అధికారుల వద్దకు కూడా వెళ్లడం లేదు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్లు వస్తారు, తూతూమంత్రంగా చూస్తారు. వెళ్లిపోతారు అంతేగా.." అంటూ బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. "ఇలాంటి ప్రమాదాలు వేరే దేశాల్లో జరిగితే భారీ జరిమానాలు ఉంటాయి. కనీసం 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. భారీ జరిమానాలు ఉన్నప్పుడే భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తారు. మనదేశంలో ప్రాణానికి విలువ లేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో పలువురు చనిపోతే జగన్ కోటి రూపాయలు చొప్పున ఇచ్చారు. అందరూ ప్రశంసించారు. అయితే బాధితులకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఏదైనా ఘటన జరిగితే అప్పుడు హడావిడి తప్పితే.. సేఫ్టీ ఆడిట్ గురించి మాటలు తప్ప చేతలు లేవు." అంటూ బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ తరహా ప్రమాదం విదేశాల్లో జరిగి ఉంటే.. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.6.4 కోట్ల నుంచి రూ.19 కోట్ల వరకూ పరిహారం అందేదని బొలిశెట్టి సత్యనారాయణ వెల్లడించారు. చ్చారు.. రూ.కోటి ఇస్తే చాలా బాగుంటుందని కాళ్లు మొక్కుతున్నామని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా హక్కుల గురించి మాట్లాడటం లేదని.. పోరాడటం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.