Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని జువెలరీ సెక్టార్ కంపెనీ మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ () బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు. తమ షేర్ హోల్డర్లు 1:1 రేషియోలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ బోనస్ షేర్ల జారీకి అర్హులైన వారిని నిర్ణయించే రికార్డు డేట్ జూన్ 16గా నిర్ణయించారు. జూన్ 16కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఆలోపు షేర్లు కొనుగోలు ఉన్న వారికే అర్హత లభిస్తుంది. దీని ప్రకారం జూన్ 15వ తేదీ సోమవారం రోజు మార్కెట్లు ముగిసే లోపు ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసి ఉండాలి. ఇక ఈ బోనస్ ఇష్యూ ప్రకారం ఎవరైతే కంపెనీకి చెందిన 1 షేరు కొనుగోలు చేసి తమ అకౌంట్ లో కలిగి ఉంటారో వారికి 1 ఈక్విటీ షేర్ బోనస్‌గా ఇస్తారు. దీని అర్థం ఒకవేళ మీ వద్ద 100 షేర్స్ ఉంటే మీకు మరో 100 షేర్స్ ఉచితంగా బోనస్ రూపంలో వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 65 శాతం నష్టపోయింది. మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ అనేది రూ. 50 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బోనస్ షేర్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. రికార్డు డేట్ నాటికి ఎవరైతే రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటారో వారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. ఈ బోనస్ ఇష్యూ రికార్డు డేట్ జూన్ 16, 2026గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించారు. చివరి ట్రేడింగ్ సెషన్లో మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ షేరు 0.86 శాతం లాభంతో రూ. 14.01 వద్ద ముగిసింది. అయితే, ఈరోజు చూసుకుంటే ఈ స్టాక్ 0.57 శాతం పెరిగి రూ.14.09 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 43.60 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 13.60 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 1 లాభపడింది. గత నెల రోజుల్లో 7 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో 49 శాతం నష్టపోయింది. అదే గత ఏడాదిలో 65 శాతం పడిపోయింది. గత ఐదేళ్ల కాలంలో 978 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 166 కోట్లుగా ఉంది.