ధరలు పెంచిన టాటా మోటార్స్.. జులై 1 నుంచి ఈ కార్లన్నీ ప్రియం.. ఎంత పెరగనుందంటే?

Wait 5 sec.

Car Price: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ, టాటా గ్రూప్‌లోని దిగ్గజ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ తమ కస్టమర్లపై అదనపు భారం మోపేందుకు సిద్ధమైంది. తమ పోర్ట్ ఫోలియోలోని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. కారు మోడల్, వేరియంట్ బట్టి ధరలను 1.5 శాతం చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలనూ పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ జూన్ నుంచే కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా ఇప్పుడు టాటా మోటార్స్సైతం అదే దారిలో నడుస్తూ ధరల పెంపు ప్రకటన చేయడం గమనార్హం.ముడి సరకుల ధర పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంతో ఆ భారం నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు పాక్షికంగా ధరల పెంపు చేపట్టాల్సి వస్తోందని టాటా మోటార్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే, వినియోగదారులపై పెద్దగా ప్రభావం పడకుండా కొంత మొత్తం మాత్రమే బదిలీ చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. టాటా టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్, పంచ్, నెక్సాన్, సియార్, హ్యారియర్ వంటి సంప్రదాయ ఐసీఈ ఇంజన్‌తో నడిచే కార్లతో పాటుగా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఇవీ, కర్వ్ ఈవీ, హ్యారియర్ మోడళ్ల ధరలను టాటా మోటార్స్ పెంచుతున్నట్లు తెలిపింది. బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపుపెంచిన కొత్త ధరలు జులై 1, 2026 నుంచే అమలులోకి తెస్తున్నామని పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తైన కార్లతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అన్ని వేరియంట్ కార్లకూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. బీఎండబ్ల్యూ కార్లు కొనాలనుకునే వారు ఈ నెలాఖరు లోగా కొనుగోలు చేయడం మంచిది. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. అలాగే ఈ 2026లో బీఎండబ్ల్యూ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.