ఏపీలోని ఈ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో మాత్రం ఎండలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ, మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.. వర్షాలు పడే సమయంలో ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయంటున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కండువా లేదా టోపీ ధరించాలని సూచించారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ముందుగా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. ఈసారి రుతుపవనాలకు సంబంధించిన సీజన్‌లో సాధారణం కంటే కొంత తక్కు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఏడాది కొద్దిరోజులు వర్షాలు పడతాయని.. మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవొచ్చు అంటున్నారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతాయంటున్నారు.