బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న చెప్పింది. రైతులు ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 10న లేదా అంతకన్నా ముందే తెలంగాణను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం ఇవి అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండు చోట్లా అనుకూల వాతావరణ పరిస్థితుల మధ్య వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. మరో రెండు రోజుల్లో ఇవి తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ ఒకటే తేదీనే వచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈసారి కాస్త ఆలస్యంగా జూన్ 4 కేరళాని తాకాయి. ఈ రుతుపవనాలు ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తాకాయి. అక్కడ ముందస్తుగా మంచి వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల రాక ఆలస్యం కావచ్చునని, అలాగే సీజనల్ వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ గతంలోనే అంచనా వేసింది. అయితే ప్రస్తుత స్థానిక వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో మారుతున్న సమీకరణాలు వర్షాలను మరింత బలపరుస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.రుతుపవనాల రాకకు ముందే రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గాలివేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల కొన్ని చోట్ల 60 కి.మీ వేగంతో వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. నేడు కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ మధ్య భాగాల్లో నైరుతి గాలులు మరింతగా విస్తరిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల ఉపరితల ఆవర్తనాలు తీవ్రమై అల్పపీడనం ఏర్పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రైతులు ముందస్తు వ్యవసాయ పనులకు సిద్ధం కావచ్చునని.. అయితే ఉరుములు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.