నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్టులో లార్డ్స్ పిచ్‌ను చూసి అందరూ స్టన్నయ్యారు. బౌలర్లకు పూర్తిగా అనుకూలంగా మారడమే కాకుండా.. బంతి బౌన్సింగ్స్ సమయంలోనూ తీవ్ర అసమానతలు రావడంతో క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం 166 ఓవర్లలోనే 40 వికెట్లు పడిపోవడంతో పిచ్‌పై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. ఐదు రోజుల ఈ టెస్టులో వర్షం పడటంతో నాలుగు రోజులకే ముగిసింది. ఒకవేళ వర్షం అడ్డుపడకపోతే మూడో రోజుకే ఆట ముగిసేది. ఈ టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ పిచ్ బౌన్స్, సీమ్ మూమెంట్ కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో 24 మంది బ్యాటర్లు బౌల్డ్ లేదా ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగడం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ మొత్తం కూడా పిచ్ ఎలాపడితే అలా బౌన్స్ కనిపించింది. కొన్ని బంతులు అనూహ్యంగా తక్కువ ఎత్తులో ఉండగా మరికొన్ని బ్యాటర్ మీదుగా వెళ్లాయి. దాంతో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా పిచ్‌పై ఐసీసీ సమీక్షకు కూడా సిద్ధమైంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైకాఫ్ట్ పిచ్ రిజల్ట్‌ను పరిశీలిస్తాడు. ఒకవేళ నిజంగా పిచ్ కరెక్ట్ లేకపోతే ఎంసీసీకి డీ మెరిట్ పాయింట్ విధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పిచ్ పరిస్థితులు కరెక్ట్‌గా లేవని చెప్పాడు. ఐదు రోజుల టెస్టు క్రికెట్‌లో వర్షం లేకపోయి ఉండుంటే మూడు రోజులకే ముగిసేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే టెస్టు క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదమని చెప్పాడు. బ్యాటర్లకు సవాళ్లుగా పిచ్‌ను తయారు చేయడం మంచిదే అయినప్పటికీ.. మరి ఇలాంటి పిచ్‌లు టెస్టు క్రికెట్‌పై ఆసక్తి తగ్గేలా చేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం తమ ఓటమికి పిచ్‌ కారణమని చెప్పలేదు. తమ ఫీల్డింగ్ సమయంలో చేసిన మిస్టేక్సే ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారాయని చెప్పాడు. పిచ్ బౌన్స్‌లో కొంచెం లోపాలు ఉన్నాయని చెప్పిన లాథమ్.. జేకబ్ బెతెల్ అవుటైన విధానం‌లో అది స్పష్టంగా కనిపించింది అని చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కూడా ఈ పిచ్‌ను నాణ్యత లేని పిచ్‌గానే అభివర్ణించాడు. మాజీ బౌలర్ సైమన్ డౌల్ పిచ్‌పై పునరాలోచించాలని చెప్పాడు.