Rain Alert: బిగ్ అలర్ట్.. మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. వచ్చే మూడు గంటలలో ఏపీలోని కొన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు గంటలలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరకు, మడగడ, బాకూరు, అనంతగిరి, గజపతినగరం, బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిందిశనివారం ఈ జిల్లాలలో వానలు..మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం రోజున పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే వార్తలు వచ్చాయి. దీని కారణంగా వర్షపాతం తక్కువగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే జూన్ నెలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే పంట కాలువలకు నీటి విడుదలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. దీంతో రైతులు ఖరీఫ్ సాగు పనులను వేగవంతం చేశారు.