‘అసలు ఈ వివాదంలోకి విష్ణుప్రియ ఎందుకు వచ్చింది?.. ఆ అమ్మాయికి ఏం సంబంధం?’.. పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్

Wait 5 sec.

'పోలీస్ కంప్లైంట్' సినిమా విషయంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు సరిగ్గా ఒక రోజు ముందు దర్శకుడు సంజీవ్ మేగోటి ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెమ్యూనరేషన్ తీసుకొని మూవీ ప్రచారానికి ఆమె సహకరించడం లేదని, డబ్బింగ్ విషయంలోనూ ఇబ్బంది పెట్టిందని ఆరోపంచారు. దీనిపై ఇప్పటికే వరలక్ష్మి స్పందించారు. 'నేను అరవను, కరుస్తా' అంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడీ వివాదంలోకి బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ భీమినేని తలదూర్చారు. 'పోలీస్ కంప్లైంట్' సినిమాలో విష్ణు ప్రియ నటించలేదు. అసలు ఈ మూవీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పై దర్శకుడు చేసిన కామెంట్స్ పై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. వరుకి సపోర్టుగా నిలిచింది విష్ణు ప్రియ. దీనిపై సంజీవ్ మేగోటి ఓ న్యూస్ ఛానల్ లో మాట్లాడారు. అసలు ఈ గొడవ మధ్యలోకి విష్ణు ప్రియ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారువరలక్షి శరత్ కుమార్ పై కావాలని ప్లాన్ చేసుకొని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ప్రెస్ మీట్ కి వచ్చిన వెంటనే హీరోయిన్ రాలేదా అని అడిగారని, ప్రమోషన్స్ కు ఆమె రాలేదని బాధనిపించి అలా మాట్లాడానని డైరెక్టర్ సంజీవ్ వివరణ ఇచ్చారు. తాను కక్ష కొద్దీ మాట్లాడలేదని, సినిమా రిలీజ్ టెన్షన్ లో ఉండటం వల్ల అనుకోకుండా ఆ మాటలు దొర్లాయన్నారు. వరలక్ష్మి షూటింగ్ కి చాలా సపోర్ట్ చేశారని, టైంకి సెట్స్ కి వచ్చేవారని చెప్పారు. ఆమె చేతికి దెబ్బ తగిలి రెండు నెలలు షూటింగ్ ఆగిపోయిందని, అయినా మళ్లీ వచ్చి చిత్రీకరణ పూర్తి చేశారన్నారు. సినిమా కోసం అంత చేసిన ఆమె ప్రమోషన్స్ కి రాలేదనే బాధతో, రిలీజ్ ప్రెజర్ తోనే మాట్లాడానని దర్శకుడు తెలిపారు. వరలక్ష్మిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయని, వేరే వేరే వాళ్లు అన్వయించుకొని కామెంట్స్ చేశారని సంజయ్ అన్నారు. ''విష్ణు ప్రియ అనే ఒక ఆర్టిస్ట్ పోస్ట్ పెట్టారు. ఆవిడతో నాకు పరిచయం లేదు. ఆమె ట్వీట్ చేశారని ఎవరో నాకు పంపించారు. 'మీరు రెమ్యురేషన్ ఇచ్చేది యాక్టింగ్ కోసమే ప్రమోషన్స్ కోసం కాదు కదా' అని పోస్ట్ పెట్టింది. నిజం చెప్పాలంటే.. వరలక్ష్మితో సహా మిగతా ఆర్టిస్టులతో అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఇన్ని రోజుల షూటింగ్.. ప్రమోషన్స్ కిన్ కూడా రావాలి అని మెన్షన్ చేశాం. అది లేకపోతే మేము ఇంత వాదించేవాళ్లం కాదు. అలా అనాల్సిన అవసరం కూడా లేదు. అగ్రిమెంటులో ఉందని వరలక్ష్మికి కూడా ముందే తెలుసు కాబట్టి, ప్రచారానికి వస్తారని ఆశ''''నేను మాట్లాడిన దాన్ని నెగెటివ్ గా తీసుకొని విష్ణు ప్రియా ట్వీట్ చేసింది. యాక్టింగ్ కి డబ్బులు ఇస్తారు కానీ, ప్రమోషన్స్ కి ఇవ్వరు అన్నట్టు మాట్లాడింది. ఆవిడ ఎందుకు మాట్లాడింది?. అసలు ఈ సినిమాతో ఆమెకు సంబంధం ఏంటి? అనేది నాకైతే అర్థం కాలేదు. విష్ణు ప్రియ ఎవరో కూడా నాకు తెలియదు. ఆమెతో పరిచయం లేదు. నేను 31 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్ లో నాకు కొంతమంది తెలియదు. ఇలా విష్ణు ప్రియ పోస్ట్ చేసిందని ఎవరో పంపించారు. డైరెక్టర్ ఏదో బాధలో అన్నాడు. ఆయన కష్టాన్ని బాధని కూడా గుర్తించాలి కదా' అని ఆమె పోస్టు కింద ఎవరో కామెంట్ కూడా పెట్టారు. బహుశా వరలక్ష్మితో చేసుకున్న అగ్రిమెంట్ గురించి విష్ణు ప్రియకి అవగాహన లేకపోయుండొచ్చు. అసలు ఆ అమ్మాయి అలా ఎందుకు మాట్లాడిందో తెలియదు. నేను కూడా నా సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్ రాలేదనే బాధ చెప్పానే తప్ప, గొడవ చేయలేదు'' అని సంజీవ్ తెలిపారు. ఇకపోతే దర్శకుడు చేసిన ఆరోపణలపై వరలక్ష్మి స్పందించారు. టీమ్ కు అవసరమైన సమయంలో తను అందుబాటులో ఉన్నానని క్లారిటీ ఇస్తూనే, ''నేను అరవను, కరుస్తా'' అంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు, నిర్మాతపై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేశారు. తెరవెనక ఏం జరిగిందో తెలియదు కానీ.. వెంటనే చేశాడు. ఆ వీడియోను ట్యాగ్ చేసిన వరలక్ష్మి.. దర్శకుడ్ని క్షమించేస్తున్నానని పోస్ట్ చేశారు. న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయని అంటూ ఫిలిం ఛాంబర్ కు థ్యాంక్స్ చెప్పారు.