పీఓకేలో పాక్ సైన్యం అరాచకాలు.. 19 మంది చిన్నారులు సహా ఏడుగురు గర్భిణీలను చంపిన వైనం

Wait 5 sec.

: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ రక్షణ బలగాలు సాగిస్తున్న అరాచకాలు, అణచివేత పర్వంపై ఒక అత్యంత సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. జూన్ 5 నుంచి జూన్ 9న తేదీ మధ్య కాలంలో అక్కడ జరిగిన పౌరుల ఊచకోతకు సంబంధించిన ఒక రహస్య డాసియర్‌ను ఇండియా టుడే సేకరించింది. ఆ అధికారిక నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తీవ్ర ఆర్థిక సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా అక్కడ శాంతియుతంగా పోరాడుతున్న ‘’ (జేఏఏసీ) ఉద్యమకారులపై పాక్ సైన్యం అత్యంత క్రూరంగా విరుచుకుపడింది.మృతుల్లో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు..!తుపాకులతో దాడులు చేయగా.. . ముఖ్యంగా మరణించిన వారిలో ఏకంగా 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీ స్త్రీలు ఉన్నారనే నమ్మశక్యం కాని నిజాలను ఈ డాసియర్ బట్టబయలు చేసింది. నిరాయుధులైన నిరసనకారులు, మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న పౌరులపై కూడా పాక్ దళాలు తుపాకులు ప్రయోగించారని సదరు నివేదిక ఆరోపించింది. ఈ అణచివేత పర్వం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు గానూ.. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను పాక్ ప్రభుత్వం పూర్తిగా నిలిపి వేసినట్లు వివరించింది.పీఓకే ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ మెయిన్‌ల్యాండ్ నుంచి సుమారు 14,000 మంది అదనపు భద్రతా సిబ్బందిని రంగంలోకి దించినట్లు నివేదిక పేర్కొంది. జేఏఏసీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ అనేక మందిని హతమార్చడం, గాయపరచడం, అర్ధరాత్రి వేళ నిర్బంధించడం వంటివి చేశారని వివరించింది. ఈ దారుణాల్లో పాక్ ఆర్మీ కమాండ్ ప్రత్యక్ష భాగస్వామ్యంపై అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని డాసియర్ గట్టిగా డిమాండ్ చేసింది. అయితే నిరసనకారులు ఇరుకైన గల్లీల నుంచి పెట్రోల్ బాంబులు, తుపాకులతో 'గెరిల్లా తరహా' దాడులకు దిగడం వల్లే తాము ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని పాక్ అధికారులు సమర్థించుకుంటున్నారు. అయినప్పటికీ.. మిర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, రావాలాకోట్ వంటి పలు ప్రాంతాల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.పాక్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం..!పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ పెద్ద ఎత్తున తప్పుడు సమాచారాన్ని, ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ) తీవ్రంగా ఖండించింది. తన స్వయంకృత అపరాధాలను కప్పిపుచ్చుకునేందుకు ఇస్లామాబాద్ చేస్తున్న నిరాధార ప్రయత్నమిదని భారత్ ఎద్దేవా చేసింది. అక్కడ జరుగుతున్న పోలీసుల క్రూరత్వంపై అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌ను నిలదీయాలని, వారి అకృత్యాలకు బాధ్యులను చేయాలని డిమాండ్ చేసింది.అంతర్జాతీయ స్థాయికి చేరిన పీఓకే నిరసనలు..ఈ అణచివేతపై బ్రిటన్‌లోని కాశ్మీరీ ప్రవాసులు లండన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 30 మంది బ్రిటీష్ ఎంపీలు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. పీఓకేలో పరిస్థితిని చక్కదిద్దడానికి దౌత్య మార్గాలను ఉపయోగించాలని కోరారు. అక్కడ బ్రిటీష్ పౌరుల అరెస్టులు, కమ్యూనికేషన్ల బంధనంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.