ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎంస్ ప్రశంసలు కురిపించారు. గతంలో జరిగిన తప్పును కూటమి ప్రభుత్వం సరిదిద్దిందని.. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌లకు ఇవ్వాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమ శాఖ నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి మార్చడాన్ని స్వాగతించారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చేశారు. కానీ దేవాదాయశాఖ పరిధిలో ఉంటేనే బావుండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమ శాఖ నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పేరుతో అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. సాధారణ పరిపాలన శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిజినెస్ రూల్స్, 2018కి తగిన సవరణలు చేయాలని ఆదేశించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పును సరిచేశారని.. ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.. చంద్రబాబు, లోకేష్‌లకు క్రెడిట్ ఇవ్వాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో దేవాదాయశాఖ విభాగంలోకి మారడంతో.. అర్చక సంక్షేమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అమలు చేయగల ఎన్నో ఎండోమెంట్ శాఖ పథకాలు ఉన్నాయిన్నారు. అంతేకాదు ఐవైఆర్ కృష్ణారావు గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బుచ్చి రాంప్రసాద్ ఉ్నారు. ఆయన గతంలో అమెరికాలో ఫార్మా రంగంలో వ్యాపారం చేశారు. ఆ తర్వాత అమెరికా వదిలి రాజకీయాల్లోకి వచ్చారు.. 2013లో టీడీపీ చేరి యాక్టివ్‌గా పనిచేశారు. ఆయన 2014 నుంచి 2019 వరకు ఏపీ ఎన్ఆర్టీ చీఫ్ కోఆర్డినేటర్‌‌గా పనిచేశారు. 2019 నుంచి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందించగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి దక్కింది.