పంజా వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ” ఫస్ట్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్!

Skip to content


డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నిన్న మేకర్స్ పంజా ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను కూడా ఆదికేశవ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియో లో తన మాస్ పెర్ఫార్మెన్స్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. ఈ ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక ఈ వీడియో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. 24 గంటల్లో 4.5 మిలియన్ వ్యూస్, 70 కే లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్న టీజర్‌లో వెల్లడి కానున్నాయి. అపర్ణా దాస్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూలై 2023లో విడుదల కానుంది.