క్రేజీ అప్ డేట్ కి రెడీ అయిన పవన్ – సాయి తేజ్ మూవీ ?

Skip to content

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ తమిళ హిట్ వినోదయ సిత్తం కి రీమేక్ గా తెరకెక్కుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మరొక రెండు రోజుల్లో అనగా గురువారం ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి రేపు మూవీ నుండి అఫీషియల్ గా ఒక అప్ డేట్ రానుందట. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జులై 28న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.