NTR30 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్
టాలీవుడ్ నుండి భారీ అంచనాలున్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. జనతా గ్యారేజ్ వంటి భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ను ముగించినట్లు చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అభిమానులకు తెలియజేశారు.
ఎన్టీఆర్ యాక్షన్ మరియు స్టైల్ బాగున్నాయి అని రాశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ బిగ్గీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Completed the 2nd schedule of #NTR30 with a powerful action???? @tarak9999 brother’s style and action is incredible ! #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts VASTHUNAA !! pic.twitter.com/KkTJJIz7tW
— Rathnavelu ISC (@RathnaveluDop) May 2, 2023