బాల‌య్య డ్రైవ‌ర్ కాదు, ఖైదీ !

Skip to content

నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా గురించి రీసెంట్‌గా ఓ రూమ‌ర్ తెరపైకి వ‌చ్చింది. ఇందులో బాల‌య్య ఆర్టీసీ డ్రైవ‌ర్‌గా క‌నిపిస్తాడ‌నేదే ఆ వార్త‌. ఈ ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, బాల‌య్య ఈ మూవీలో చాలా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడ‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. బాలయ్య ఫస్ట్ హాఫ్ మొత్తం ఖైదీగా కనిపిస్తారట. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ మూవీగా రాబోతుంది. పైగా ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెప్పబోతున్నారు.

అలాగే బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే.. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి అరవై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి