లేటెస్ట్.. ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “శాకుంతలం”.!

Published on May 11, 2023 7:04 am IST

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన రీసెంట్ భారీ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” కోసం అందరికీ తెలిసిందే. దీనికి ముబడు “యశోద” చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సామ్ ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూసింది. కానీ ఫైనల్ గా ఈ సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది. అయితే దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా ఓటీటీ లో వచ్చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా పాన్ ఇండియా భాషల తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఈ సినిమా ఈ అన్ని భాషల్లోనూ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. మరి అప్పుడు చూడకుండా ఇప్పుడు చూడాలి అనుకునేవారు అయితే చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.