భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి ప్రభాస్ విరాళం!

Skip to content


హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రీరాముడుగా కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే, ప్రభాస్ చేసిన పని, అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది.

భద్రాచలంలోని పవిత్రమైన శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి ప్రభాస్ 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రభాస్ తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరు మీద విరాళం ఇచ్చాడు. ప్రభాస్ సన్నిహితుడు విక్కీ ఆలయ కార్యనిర్వహణాధికారిని కలిసి చెక్కును అందజేశారు. ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.