తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలకు ఆగ‌స్టు ఇవాళ అంకురార్పణ జరగనుంది. 'ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది' అని తెలిపారు.'ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ మేరకు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప‌విత్రోత్సవాల్లో ఆగ‌స్టు 4న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగ‌స్టు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్దయ్యాయి' అని టీటీడీ తెలిపింది.శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు'తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్యక్రమాలు, ఆగ‌స్టు 8న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్నప‌న‌తిరుమంజ‌నం, చ‌క్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేప‌డ‌తారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధ‌ర్మప్రచార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు' అని తెలిపారు.'తిరుపతి శ్రీ కోదండరామస్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు' అని టీటీడీ తెలిపింది.