జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్‌ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జమ్మూ కశ్మీర్‌‌తో పాటు పలు రాష్ట్రాలకు ఆయన గవర్నర్‌గా పనిచేశారు.జాట్ సామాజిక వర్గానికి చెందిన సత్యపాల్ మాలిక్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. తొలిసారి 1974లో చౌధరి చరణ్ సింగ్ స్థాపించిన భారతీయ క్రాంతి దళ్ తరఫున ఎమ్మెల్ఏగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత జనతా దళ్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అలీగఢ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు . అనంతరం కాంగ్రెస్.. అక్కడ నుంచి లోక్‌దళ్ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2017లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు