ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. పావలా వడ్డీకే రుణాలు.. ‘కలలకు రెక్కలు’

Wait 5 sec.

విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వినూత్న మార్పులు తీసుకువస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్‌ను శుక్రవారం (డిసెంబర్ 5) నిర్వహించగా.. మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విదేశీ విద్య కోసం రూపొందించినట్లు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా పావలా (25 పైసల) వడ్డీతో రుణాలు అందిస్తామని చెప్పారు. సీఎం ప్రకటనపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షైనింగ్ స్టార్స్..కాగా, చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి 'షైనింగ్ స్టార్స్' ప్రోగ్రాం ప్రవేశపెట్టామని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివారని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రంలోని విద్యార్థులను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఏపీ విద్యశాఖలో నూతన ఒరవడి సృష్టిస్తానని లోకేశ్ అన్నారని.. అందుకే విద్యా శాఖ పగ్గాలు తీసుకున్నారని చెప్పారు. దానికి తాను లోక్‌శ్‌ను ఆశీర్వదించానని చెప్పారు.ఉపాధ్యాయులకు విదేశాల్లో ట్రైనింగ్.. విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించడానికి తమ ప్రభుత్వ కృషి చేస్తోందన్న చంద్రబాబు.. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. వారి ద్వారా దశల వారిగా రాష్ట్రంలో ఉన్న టీచర్లందరికీ.. ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కానీ ఉపాధ్యాయులను గౌరవించడమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చెప్పారు. స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తాం..విద్యా వ్యవస్థపై స్పష్టమైన విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని.. రాష్ట్రంలో తాము ప్రకటించారు. భవిష్యత్‌లో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుతారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వినూత్నమైన మార్పులు చేశారని అభినందించారు. ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. కాగా, రాష్ట్రంలో విద్యార్థులు సృజనాత్మకతతో ముందుకువెళ్తున్నారని.. అలాంటి వారి కోసం 2026 జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.