మళ్లీ పెరిగిన బంగారం ధర.. సరికొత్త రికార్డ్.. ఈరోజు తులం రేటు ఎంతకు చేరిందంటే?

Wait 5 sec.

: లు చూస్తే పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారికే కాదు సంపన్నులకూ చుక్కలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆల్ టైమ్ హై స్థాయులను చేరుకున్న క్రమంలో దేశీయంగానూ పసిడి రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. దసరా పండగకు ముందు ఇలా బంగారం రేట్లు విపరీతంగా పెరగడం కొనుగోలుదారులను వెనకడుగు వేసేలా చేస్తోంది. సాధారణంగా భారత్‌లో దసరా, దీపావళికి బంగారం ఎక్కువగా కొంటుంటారు. ఇలాంటి సమయంలో ధరలు పెరగడంతో చాలా మంది కొనుగోళ్లలో కోత పెట్టుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు దూసుకెళ్లడం షాకింగ్ అంశంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ఈరోజు ఏకంగా 34.75 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర 3862 డాలర్ల వద్దకు దూసుకెళ్లింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.32 శాతం మేర తగ్గి 46.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరహైదరాబాద్ విపణిలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. 999 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర ఒక్కరోజే రూ.550 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,17,440 వద్దకు దూసుకెళ్లింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ 10 గ్రాములపై రూ.500 పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,07,650 వద్దకు ఎగబాకింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ హై స్థాయిగా చెప్పవచ్చు.రూ.1000 పెరిగిన వెండి ధరదీంతో ఇవాళ కిలో సిల్వర్ రేటు రూ.1,61,000 స్థాయికి చేరుకుంది. ఇది సైతం సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.1,51,000 వద్ద ట్రేడవుతోంది.పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు అక్టోబర్ 1వ తేదీన బుధవారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. ట్యాక్సులు కలిపితే ప్రాంతాల వారీగా ధరలు వేరు వేరు ఉంటాయి. కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.