ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. విశాఖపట్నానికి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్‌తో పాటు పలు ఐటీ సంస్థలు వచ్చాయి. అయితే విశాఖపట్నం మాత్రమే కాదు రాష్ట్రంలోని పలు నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభమైంది. విజయదశమి రోజున ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఈ సంస్థలో 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తన స్వగ్రామంలో కంపెనీ పెట్టడం ద్వారా గుడివాడ అభివృద్ధికి తోడ్పడ్డారు.గుడివాడ ఎమ్మెల్యే రాము కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ విజయంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రిన్స్‌టన్ ఐటీ సంస్థను తన సొంత కంపెనీగా భావిస్తానని.. ఈ కంపెనీ విజయానికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 'పీ4 స్ఫూర్తి'తో సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థను నెలకొల్పడం ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఈ ఐటీ సంస్థను ఏర్పాటు చేశానని ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తెలిపారు. ఈ సంస్థ న్యూజెర్సీ, కెనడా, డొమినికాలో పనిచేస్తుందని.. హైదరాబాద్, కాకినాడలో కూడా దీని కార్యకలాపాలు ఉన్నాయన్నారు. బెంగళూరులో పరిశ్రమలు ఉత్తరం వైపు విస్తరిస్తున్నాయి.. దీనివల్ల అనంతపురం పెట్టుబడులకు చాలా మంచి ప్రాంతం అవుతుందన్నారు . భవిష్యత్‌లో అనంతపురం కొత్త పెట్టుబడులకు పెద్ద కేంద్రంగా మారుతుందన్నారు. త్వరలోనే అనంతపురంలో ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ ఎకో సిస్టం కూడా వస్తుందని.. బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ సమస్యల గురించి ఒక అధ్యయనం చెప్పినప్పుడు మంత్రి స్పందించారు. బెంగళూరుకు అనంతపురం చాలా దగ్గరగా ఉంది.. అందుకే, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తాయన్నారు. ఇది పెట్టుబడులకు స్వర్గధామం అవుతుందన్నారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులోని ఔటర్‌ రింగ్‌రోడ్‌లో పరిస్థితులు అంత బాగా లేవు.. అందుకే, కొత్త కంపెనీలు, పరిశ్రమలు ఉత్తర బెంగళూరు, వైట్‌ ఫీల్డ్‌ ప్రాంతాలకు వెళ్తున్నాయంటున్నారు.