గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అదిరే శుభవార్త. ఈరోజు లు భారీగానే దిగివచ్చాయి. దసరా పండగ వేళ బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఊరట కల్పించినట్లయింది. గత వారం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ధరలు గరిష్ఠ స్థాయుల్లో ఉండడం మళ్లీ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దేశీయంగా బంగారం రేట్లు ఈ రోజు దిగిరావడం మంచి అవకాశం. మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్ల మేర తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3857 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఇవాళ 1.37 శాతం మేర దిగివచ్చింది. ఇప్పుడు ఔన్స్ సిల్వర్ ధర 46.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరగత వారం రోజుల నుంచి భారీగా దిగివచ్చిన పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర ఇవాళ తులంపై రూ.550 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 999 స్వచ్ఛమైన బంగారం రేటు రూ. 1,18,690 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు తులంపై రూ.500 మేర దిగివచ్చింది. దీంతో తులం రేటు రూ. 1,08,800 వద్దకు దిగివచ్చింది. రూ.2000 పెరిగిన వెండి ధరబంగారాన్ని మించి పెరుగుతోంది. ఇవాళ కిలో వెండి ధర రూ. 2000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.1,63,000 స్థాయికి ఎగబాకింది. అయితే, ఢిల్లీ, ముంబై, పుణే సహా పలు నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,53,000 స్థాయుల్లోనే ఉండడం గమనార్హం. ఈ కథనంలో పేర్కొన్న బంగారం, వెండి రేట్లు అక్టోబర్ 3వ తేదీన ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి పసిడి ధరలు మారుతుంటాయి. పన్నులు కలిపి లెక్కగడితే పసిడి రేట్లు ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటాయి. కొనే ముందే తెలుసుకోవడం మంచిది.