Best HDFC mutual funds: దేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఒకటి. గత కొన్నేళ్లలో ఇన్వెస్టర్ల ఆదరణ పొందింది. విభిన్న ప్రొఫైల్స్ కలిగిన వారికి ఈ ఫండ్ స్కీమ్స్ మంచి ఎంపికగా నిరూపించాయి. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో చూసుకుంటే ఈ ఫండ్ హౌస్‌కి చెందిన కొన్ని పథకాలు అద్భుతంగా రాణించాయి. తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ ఇచ్చాయి. ఆ స్కీమ్స్ వార్షిక రాబడి CAGR రేటు 20-27 శాతంగా ఉంది. అందులోని టాప్-5 పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటికి వాల్యూ రీసెర్చ్ సంస్థ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ఈ స్కీమ్‌ని 2013, జనవరిలో లాంచ్ చేశారు. అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 21.06 శాతంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.84,000 కోట్లుగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 150టీఆర్ఐ అనేది బెంచ్ మార్క్‌గా ఉంది. హైరిస్క్ సామర్థ్యం ఉన్న వారికి ఈ స్కీమ్ సరిగ్గా సరిపోతుంది. ఈ స్కీమ్ గత 3 సంవత్సరాల రిటర్న్స్ చూసుకుంటే లంప్ సమ్ పెట్టుబడి రాబడులు వార్షికంగా 26.89 శాతంగా ఉన్నాయి. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు అది రూ.2.04 లక్షలు అవుతుంది. అందే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రాబడులు 22.94 శాతంగా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం నుంచి నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి కొనసాగిస్తూ వస్తే ఇప్పుడు ఆ విలువ రూ.5 లక్షలు అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఫోకస్డ్ ఫండ్ఈ స్కీమ్ 2004, సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. అప్పటి నుంచి చూస్తే రాబడులు 16.10 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్ల క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టి ఉంటే వార్షిక రాబడి సీఏజీఆర్ రేటు 24.32 శాతంతో ఇప్పుడు అది రూ.1.92 లక్షలు అవుతుంది. అదే సిప్ పెట్టుబడుల రాబడి 37.64 శాతంగా ఉంది. అంటే రూ.10 వేల సిప్ పొదుపు ఇప్పుడు రూ.4.95 లక్షలు అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే, గత మూడు సంవత్సరాల రాబడి చూసుకుంటే 23.42 శాతంగా ఉంది. ఇందులో ఒకేసారి లంప్‌సమ్ విధానంలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ. 1.88 లక్షలు అవుతుంది. అదే సిప్ పెట్టుబడి అయితే 36.6 శాతం రాబడితో రూ.10 వేల పొదుపు ఇప్పుడు రూ.4.91 లక్షలు అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే ఈ పథకం (HDFC ELSS Tax Saver Fund) 1996, మార్చిలో ప్రారంభించారు. అప్పటి నుంచి చూస్తే 23.18 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇచ్చింది. గత 3 సంవత్సరాల రాబడులు చూస్తే లంప్‌సమ్ రిటర్న్స్ 22.82 శాతంగా ఉన్నాయి. లక్ష పెడితే ఇప్పుడు అది రూ.1.85 లక్షలు అవుతుంది. ఇక సిప్ పెట్టుబడుల రాబడి వార్షికంగా 35.47 శాతంగా ఉన్నాయి. అంటే రూ.10 వేల పొదుపు ఇప్పుడు రూ.4.87 లక్షలు అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్అప్పటి నుంచి వార్షికంగా 20.06 శాతం రాబడులు అందిస్తోంది. ఇక గత 3 ఏళ్ల లంప్ సమ్ రాబడి సీఏజీఆర్ రేటు 20.23 శాతంగా ఉంది. దీని ప్రకారం లక్ష పెట్టుబడి రూ.1.73 లక్షలు అవుతుంది. అలాగే రూ.10 వేల సిప్ పెట్టుబడి 22.79 శాతం రిటర్న్స్‌తో రూ.4.60 లక్షలు అవుతుంది.