ప్రియుడ్ని ఇంటికి ఆహ్వానించి.. భర్తతో కలిసి కిరాతకంగా హత్యచేసింది!

Wait 5 sec.

వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. కట్టుకున్నవాళ్లను అతి కిరాతకంగా కడతేర్చిన భార్యలు కొందరతై.. ఇల్లాలిని నిర్దాక్షిణ్యంగా చంపిన భర్తలు ఎందరో. అయితే, ఓ మహిళ తన భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన సంఘటన ఇది. ప్రియుడ్ని ఇంటికి రప్పించి... అతడ్ని చిత్రహింసలు పెట్టి భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసులో దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, బాధిత కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. అనీశ్ (45) కొన్నేళ్ల కిందట వారి పక్కింటిలో ఉండే రయీస్ అహ్మద్, అతడి భార్య సితారలు రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇటీవలే అనీశ్‌కు పెళ్లి కుదిరిందని, తన డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు రయీస్ ఇంటికి వెళ్లాడని అతడి తండ్రి ముస్తకీమ్ తెలిపాడు. ఈ సమయంలో అహ్మద్, సితారలు తన కుమారుడ్ని బంధించి, స్క్కూడ్రైవర్, కటింగ్ ప్లేయర్‌‌తో పొడిచి, చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశాడని ఆరోపించారు. ఇంటికి పిలిచి మరీ కాళ్లుచేతులు విరిచి, ఒంటిపై బట్టలు విప్పదీసి కిరాతకంగా హత్య చేశారని ఆరోపణలు చేశాడు.అయితే, పోలీసులు మాత్రం ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమని తెలిపారు. అడిషినల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ... శనివారం రాత్రి అనీశ్ చనిపోయాడని చెప్పారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదుచేశామని అన్నారు. అనీశ్ పక్కంటిలో ఉండే రయీస్ అహ్మద్, అతడి భార్య సితారలు దారుణంగా హత్యచేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ‘అనీశ్, సితార మధ్య వివాహేతర సంబంధం ఉందనే విషయం విచారణలో గుర్తించాం.. అనీశ్ హత్య కోసం దంపతులు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు.. అతడ్ని ఇంటికి రప్పించి మరీ అతి కిరాతకంగా హత్య చేశారు.. కానీ, ఈ హత్యలో సితార ఎందుకు భాగస్వామి అయ్యిందనేది స్పష్టంగా తెలియదు’ అని పేర్కొన్నారు.అనీశ్ కుటుంబసభ్యులు మాత్రం డబ్బుల విషయంలో తన కుమారుడ్ని చంపేశారని వాపోయారు. తన కొడుకును చిత్రహింసలు పెట్టి చెప్పుకోడానికి కూడా వీల్లేని విధంగా అత్యంత క్రూరంగా హత్య చేశారన్నారు. వారి చెర నుంచి తప్పించుకుని ఇంటికొచ్చి ప్రాణాలు విడిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతులను అరెస్ట్ చేశామని, దర్యాప్తులో ఎందుకు హత్య చేశారనేది తెలుస్తుందని చెప్పారు. దీని వెనుక ఎంకెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోందని తెలిపారు.