: గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలకు తోడు.. అంతర్జాతీయంగా అనిశ్చితి దీనికి కారణం. ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వంటివి ఇన్వెస్టర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్లు కూడా ఇటీవలి కాలంలో నెగెటివ్ రిటర్న్స్ ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ రిస్క్ కాస్త తక్కువే ఉంటుందని చెప్పొచ్చు. ఫండ్ మేనేజర్. వేర్వేరు రంగాల స్టాక్స్‌లో మీ పెట్టుబడి ఉంటుంది కాబట్టి వైవిధ్యత ఉంటుంది. రిటర్న్స్ పరంగా బ్యాలెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకుల నేపథ్యంలో ఇక్కడ కొంత కాలంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. >> ఇప్పుడు మనం ఏడాది వ్యవధిలో మ్యూచువల్ ఫండ్ల పనితీరు గురించి చూద్దాం. మొత్తం ఈ సమయంలో 272 ఈక్విటీ ఉండగా.. 135 ఇందులో ప్రతికూల రాబడే అందించింది. 136 మాత్రం లాభాల్ని అందించాయి. ఇంకాగ ఇందులో 12 ఈక్విటీ స్కీమ్స్ 10 శాతానికిపైగా నష్టపోయాయి. గత కొంత కాలంగా అద్భుత రాబడి ఇస్తూ వస్తున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి.. క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్ అత్యధికంగా 15.77 శాతం నష్టపోయింది. ఈ క్రమంలో ఏడాది కిందట రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే వారికి రూ. 84 వేలు మాత్రమే వచ్చాయి. రూ. 15 వేలకుపైగా నష్టపోయారు. సామ్‌కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా 15.60 శాతం నష్టపోగా.. ఇక్కడ కూడా లక్ష పెట్టుబడిపై రూ. 84 వేలే వచ్చాయి. >> క్వాంట్ నుంచే ఎక్కువ పథకాలు ఉన్నాయి. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ క్వాంట్ వాల్యూ క్యాప్ ఫండ్ వరుసగా 14.75 శాతం, 13.78 శాతం, 13.70 శాతం, 12.45 శాతం నెగెటివ్ రిటర్న్స్ ఇవ్వడం గమనార్హం. ఇక్కడ కూడా రూ. 12-14 వేలకుపైగా నష్టం వాటిల్లింది.శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ 12 శాతానికిపైగా నష్టపోయాయి. ఇక్కడ రూ. 12 వేలకుపైగా నష్టం వచ్చింది. NJ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 11.91 శాతం ప్రతికూల రాబడి అందించింది. శ్రీరామ్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ 10.94 శాతం నష్టపోయింది. మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్, క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ వరుసగా 10.55 శాతం, 10.30 శాతం నష్టాల్ని ఇచ్చాయి. ఇక్కడ రూ. లక్ష పెట్టుబడిపై రూ. 10 వేలకుపైగా నష్టం వచ్చిందని చెప్పొచ్చు.