ఆ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఇక నో ట్యాక్స్.. కొత్త ఐటీ బిల్లులో కీలక మార్పులు

Wait 5 sec.

Tax Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త. (UPS) ఎంచుకున్న వారికి భారీ ఊరట కల్పించింది కేంద్రం. కొత్త ఐటీ బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో యూపీఐ ఎంచుకున్న ఉద్యోగులకు సైతం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) మాదిరిగానే పన్ను మినహాయింపులు కల్పిస్తూ కేంద్రం ట్యాక్స్ నిబంధనలు మార్చింది. కొత్త ఐటీ బిల్లు 2025 ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు పదవీ విరమణ, స్వచ్ఛంద పదవీ విరమణ, సూపర్‌యాన్యుయేషన్ సమయంలో తీసుకునే 60 శాతం డబ్బులకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంతేకాకుండా, సర్వీస్ పీరియడ్ ఆధారంగా పొందే లంప్‌సమ్ చెల్లింపులకు కూడా పన్ను ఉండదు. ఈ మార్పు యూపీఎస్ చందాదారులకు ఆర్థిక భద్రతను పెంచుతుంది. 'యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులకు ఆర్థిక సేవల శాఖ జనవరి 24, 2025 రోజు నాటి నోటిఫికేషన్ నంబర్ FX-1/3/2024-PRలో పేర్కొన్న విధంగా సూపర్‌యాన్యుయేషన్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణ సమయంలో లేదా ఫండమెంటల్ రూల్స్ క్లాజ్ (j)లోని రూల్ 56 ప్రకారం పదవీ విరమణ సమయంలో వ్యక్తిగత కార్పస్‌లో 60 శాతం మొత్తం పన్ను రహితం. అలాగే పేరా 2లోని క్లాజ్ (vi) ప్రకారం లంప్‌సమ్ మొత్తంగా స్వీకరించిన ఏదైనా మొత్తం కూడా పన్ను మినహాయింపు పొందుతుంది' అని ఐటీ బిల్లు పేర్కొంది.ఈ పథకం కింద, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ మాదిరిగానే పెట్టుబడి, ఉపసంహరణ సౌలభ్యంతో పాటు స్థిర నెలవారీ పెన్షన్‌ను పొందుతారు. యూపీఎస్ సైతం ఎన్‌పీఎస్ ట్రస్ట్ కింద ఉంటుంది. అంటే ఎన్‌పీఎస్ అన్ని పన్ను ప్రయోజనాలు ఇప్పుడు యూపీఎస్‌కు కూడా వర్తిస్తాయి.ఇప్పటి వరకు, యూపీఎస్‌కు ఎన్‌పీఎస్ మాదిరిగా పన్ను మినహాయింపు లేదు, దీని వలన పదవీ విరమణ సమయంలో ఉద్యోగులపై పన్ను భారం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు అమలు తర్వాత, యూపీఎస్ చందాదారులు రెగ్యులర్ పెన్షన్ హామీతో పాటు ఎన్‌పీఎస్ మాదిరిగానే పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ చర్య ఉద్యోగులు ఎక్కువ కాలం పెన్షన్ పథకంలో కొనసాగడానికి, ఆర్థిక భద్రతను పెంచడానికి సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.