ఈ వారం IPOకు 4 కంపెనీలు.. ఆగస్టు 21 వరకు ఛాన్స్.. ఒక్కో షేరుకు ఎంత ధరంటే?

Wait 5 sec.

Upcoming IPO: ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొననుంది. ఈసారి నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. తొలి పబ్లిక్ ఆఫర్‌లు వస్తున్న క్రమంలో లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. కొత్త ఐపీఓల్లో పటేల్ రిటైల్, రీగల్ రీసోర్సెస్, శ్రీజీ షిప్పింగ్, బ్లూస్టోన్ జువెలరీ అండ్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఉన్నాయి. అలాగే గత వారమే ప్రారంభమైన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ , ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ పబ్లిక్ ఇష్యూల సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 11తో ముగుస్తోంది. గత వారం సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన హైవే ఇన్‌ఫ్రా, నాలెడ్జ్ రియాల్టీ ట్రస్ట్ ఐపీఓలు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ. 492- 517గా నిర్ణయించింది. కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 1540 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్క లాట్ 29 షేర్ల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రీగల్ రీసోర్సెస్ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 12వ తేదీన మంగళవారం ప్రారంభమవుతుంది. ఆగస్టు 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రైస్ బ్యాండ్ రూ. 96- 102గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 144 షేర్లకు దరఖాస్తు చేయాలి. కంపెనీ ఐపీఓతో రూ. 306 కోట్లు సమీకరించింది. 85.18 లక్షల తాజా షేర్లు జారీ చేస్తుండగా, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 10.02 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. రూ. 300 కోట్ల వరకు సమీకరించవచ్చని అంచనాలున్నాయి. అలాగే షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కంపెనీ శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 19వ తేదీన మొదలై 21తో ముగుస్తుంది. పూర్తిగా తాజా షేర్లు జారీ చేస్తున్నారు. 1.63 కోట్ల షేర్లు విక్రయిస్తున్నారు. ఐపీఓకు భారత్ పేపబ్లిక్ ఇష్యూకు వచ్చే ముందు నిధులు సమీకరించాలని నిర్ణయించినట్లు భారత్ పే సీఈఓ నళిన్ నేగి తెలిపారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఐపీఓకు వస్తామని తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఐపీఓ ఉండక పోవచ్చని తెలిపారు. ఉద్యోగులకు స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ మినహాయించిన తర్వాత కంపెనీ నిర్వహణ లాభాన్ని ప్రకటించింది.