సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుండగా.. హైప్ తీసుకుని రావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిపరీక్ష అంటూ ఆట మొదలయ్యేముందే కొత్త టాస్క్‌తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ఈసారి బిగ్ బాస్‌లో రెండు హౌస్‌లు ఉండబోతున్నాయి. ఒకటి సెలబ్రిటీలు.. రెండు సామాన్యులు. ఇప్పటికే కామన్‌మ్యాన్ సెలక్షన్స్ కోసం ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి.. వాళ్లలో 40 మంది సెలెక్ట్ చేయగా.. వాళ్లని అగ్నిపరీక్ష హౌస్‌లోకి పంపిస్తున్నారు. వీళ్లలో నుంచే కామన్‌మ్యాన్ కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేయబోతుండగా.. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అయితే నాగార్జునతో పాటు.. వెన్నెల కిషోర్ కూడా ఈ ప్రోమోలో కనిపించి హైప్ క్రియేట్ చేశారు. నా షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి.. నాకు కొత్త ప్లాన్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్లాలని అనుకుంటున్నాడు అని అంటాడు వెన్నెల కిషోర్. ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్.. ఆ నవ గ్రహాల బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని అంటాడు అని డ్రైవర్. దాంతో వెన్నెల కిషోర్.. మరి ఆ గ్రహాల కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అని కిషోర్ అంటే.. కామన్ ఫ్రెండ్ కాదు.. కమాండింగ్ ఫ్రెండే ఉన్నారు అంటూ నవగ్రహాలను గిరిగిర తిప్పే మాంత్రికుడిలా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హాయ్ కిషోర్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడానికి వచ్చావా? అని నాగార్జున అంటే.. ‘ఏలడానికి వచ్చాను’ అని అంటారు కిషోర్. దానికి పెద్దగా నవ్విన నాగార్జున అది నీ వల్ల కాదు. ఈసారి చాలా టఫ్.. అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా?? ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్.. కామనర్స్, సెలబ్రిటీలు కలిసి ఆడతారో.. ఆడుకుంటారో చూద్దాం’ అని అంటాడునాగార్జున. చూద్దాం కాదు.. చూసేశా.. అన్ని సీజన్ల ఎపిసోడ్‌లు చూసేశా.. నేను రెడీ అని కిషోర్ అంటే.. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా? అని అడుగుతాడు నాగార్జున. దాంతో వెన్నెల కిషోర్.. ‘నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌తోనే మాట్లాడుకుంటానే అని వెళ్లిపోతుంటే.. అందుకే ఈ సారి ఏకంగా బిగ్ బాస్‌నే మార్చేశాను.. ఈసీజన్‌లో అందరి సరదాలు తీరిపోతాయి. ఈసారి చదరంగం కాదు రణరంగమే’ అంటూ గంభీరమైన గొంతుతో అరిచి చెప్తున్నాడు నాగార్జున. అయితే ప్రోమోని బట్టి షోలో చాలా ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. ఏకంగా బిగ్ బాస్‌నే పీకి పారేశాను అని చెప్పడాన్ని బట్టి చూస్తే.. హోస్ట్‌గా నాగార్జున రణరంగం సృష్టంచేట్టుగానే కనిపిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బిగ్ బాస్‌లో రెండు హౌస్‌లు ఉండటం. గతంలో హిందీ బిగ్ బాస్‌లో ఇలా రెండు హౌస్‌లతో షో నడిపారు. ఇప్పుడు తెలుగులో మొదలుకాబోతుందనే హింట్ ఇచ్చారు. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా? అని ప్రోమోలో నాగార్జున అన్నారు కానీ.. సిలబస్ పాతదే.. బట్ ఎగ్జామ్ సెంటర్ మాత్రమే మారిందన్నమాట.