Desead Bank Account: మరణించిన వారి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆయా ఖాతాల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కోసం ఫారాలను ప్రామాణికరించాలని భావిస్తోంది. దీని ద్వారా 15 రోజుల లోపు క్లెయిమ్స్ పరిష్కరించి వారి వారి నామినీలకు పరిహారం అందించాలని చెబుతోంది. ఈ మేరకు బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే పెనాల్టీలు, ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. క్లెయిమ్ సెటిల్మెంట్‌ను మరింత సులభంగా, సౌకర్యవంతగా పూర్తి చేయడమే ఈ విధానాల లక్ష్యంగా తెలిపింది. ఇందు కోసం 'ముసాయిదా సర్క్యులర్ ఆర్‌బీఐ ఆదేశాలు (మరణించిన వారి బ్యాంక్ ఖాతా క్లెయిమ్ సెటిల్మెంట్)- 2025'ను జారీ చేసింది. ఆగస్టు 27వ తేదీ వరకు ఈ ముసాయిదా సర్క్యూలర్‌పై తమ అభిప్రాయాలు తెలపాలని కోరింది. 15 రోజుల సెటిల్మెంట్ డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటి జాప్యం చేస్తే నామినీలకు పరిహారంతో పాటు పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. నామినీ పేరు సూచించిన కేసుల్లో క్లెయిమ్ చేసే వ్యక్తి క్లెయిమ్ ఫారాలు, డెత్ సర్టిఫికెట్, అధికారిక గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నామినేషన్ లేని బ్యాంక్ ఖాతాలు, లాకర్ల విషయంలో బ్యాంకులు సరళమైన సెటిల్మెంట్ ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. రూ. 15 లక్షల కనీస త్రిషోల్డ్ లిమిట్ నిర్ణయించింది. ఈ పరిమితి వరకు క్లెయిమ్స్ చేస్తే నష్ట పరిహారం బాండు, షూరిటీ, చట్టపరమైన వారసుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవనే లెటర్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇక త్రిషోల్డ్ లిమిట్ రూ. 15 లక్షలకు మించి ఉంటే వారసులము అని తెలిపే సర్టిఫికెట్ లేదా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సెఫ్ డిపాజిట్ లాకర్, సెఫ్ కస్టడీలోని వస్తువులకు సైతం ఇదే ప్రక్రియ ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోనే బ్యాంకులు ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ప్రాసెస్ పూర్తి చేస్తున్నారనే విషయాన్ని క్లెయిమ్ చేసిన వారికి తెలియజేయాల్సి ఉంటుంది.