శాంతించిన బంగారం ధరలు.. మంచి ఛాన్స్.. హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే?

Wait 5 sec.

: పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. గత వారం రోజుల నుంచి వరుసగా పెరుగుతూ మళ్లీ సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్న శాంతించాయి. క్రితం రోజు భారీనే దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే ధర వద్ద కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారానికి గిరాకీ ఉంటుంది. ఇలాంటి తరుణంలో కాస్త తగ్గడం ఊరట కల్పించే విషయంగానే చెప్పవచ్చు. గత వారం అమెరికా సుంకాల ప్రకటనలతో వాణిజ్య అనిశ్చితి నెలకొని బంగారంపై తీవ్ర ప్రభావం చూపించింది. కొత్త రికార్డ్ నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 12.20 డాలర్ల మేర తగ్గింది. దీంతో ఔన్స్ పసిడి రేటు 3384 డాలర్ల వద్దకు తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.37 శాతం తగ్గి 38.18 డాలర్ల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధరలు క్రితం రోజు తగ్గిన గోల్డ్ రేటు ఇవాళ స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర క్రితం రోజు రూ.270 మేర తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,03,040 వద్దకు దిగిరాగా ఇవాళ సైతం అదే ధర పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఇవాళ రూ. 94,450 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. స్థిరంగానే వెండి రేటుబంగారంతో పాటు వెండి సైతం శాంతించింది. దేశీయ మార్కెట్లో వెండి రేటు గత నాలుగు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,27,000 వద్దే ట్రేడవుతోంది. అయితే, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,17,000 వద్ద కొనసాగుతోంది. ఈ కథనంలో పేర్కొన్న బంగారం ధరలు ఆగస్టు 11 సోమవారం రోజున ఉదయం 6 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. జీఎస్టీ వంటి ట్యాక్సులతో ధరలు లెక్కిస్తో ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. కొనే ముందు మీ ప్రాంతంలోని ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.