కెనడాలోనిపై మరోసారి దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. సర్రేలోని కప్స్ కేఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు 25 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. నెల రోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. అయితే, ఈ కాల్పులు జరిపింది తామేనంటూ గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్, లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్‌‌లు పెట్టాయి. దుండగులు కాల్పులు జరుపుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితులు 25 రౌండ్ల పాటు కాల్పులు జరిపి.. భయభ్రాంతులకు గురిచేశారు.‘‘ మేము టార్గెట్ చేసిన వ్యక్తికి హెచ్చరికలు చేశాం.. కానీ అతడు వినిపించకోలేదు, కాబట్టి మేము చర్య తీసుకోవలసి వచ్చింది. అతడి ఇంకా ఈ హెచ్చరిక వినిపించకపోతే, తదుపరి చర్య త్వరలోనే ముంబయిలో తీసుకుంటాం’’ అని కాల్పులు జరుపుతూ దుండుగులు అరుస్తుండటం వీడియోలో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై ముంబయి పోలీసులు, భద్రతా సంస్థలు స్పందించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, కపిల్ శర్మ కేఫ్‌పై తొలిసారి జులై 10న కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో ఉద్యోగులు కేఫ్‌లోనే ఉన్నా.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కనీసం పది రౌండ్లు పాటు జరిపిన కాల్పుల్లో కేఫ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అటు, కు పాల్పడుతోన్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కాల్పుల ఘటనపై కాప్స్ కేఫ్ స్పందిస్తూ ఇటువంటి హింసను అప్యాయత, ప్రేమతో ఎదుర్కొంటుందని ప్రకటించింది జులై 10న జరిగిన కాల్పులకు ఖలిస్థానీ వేర్పాటువాదులే కారణమంటూ భారత మీడియాలో వచ్చిన నివేదికల గురించి తమకు తెలుసని స్థానిక పోలీసులు తెలిపారు. కాప్స్ కేఫ్‌లో జరిగిన మొదటి కాల్పుల ఘటన తర్వాత, ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) సభ్యుడు.. కపిల్ శర్మ షోలో పాల్గొన్న వ్యక్తి నిహాంగ్ సిక్కుల సాంప్రదాయ దుస్తులు, ప్రవర్తనపై కొన్ని "హాస్యాస్పద" వ్యాఖ్యలు చేశాడని, ఇది సిక్కు సమాజ మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించాడు. జులై 10న జరిగిన కాల్పులకు బీకేఐ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించాడు.