: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి నీటిని మూసీ నదిలోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం నగరంలో కురిసిన కుండపోత వానలకు హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నీటి విడుదల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ () అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు హిమాయత్‌ సాగర్‌ గేట్లు తెరిచి నీటిని దిగువన ఉన్న మూసీలోకి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా సహాయం కావాల్సిన వారు 040-21111111 నంబర్‌కు సంప్రదించాలని జీహెచ్ఎంసీ వెల్లడించింది.హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి వచ్చి చేరాయి. నగరంలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మధురానగర్‌, మాదాపూర్‌, ఖైరతాబాద్‌, కోఠి, గచ్చిబౌలి, రాయదుర్గం, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. ఇక సైబర్‌ సిటీలో ట్రాఫిక్‌ ధాటికి టెకీలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, ఐకియా, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నెలకొంది.