కవిత- కేటీఆర్, జగన్- షర్మిల మధ్య దూరానికి కారణం ఇదే.. సమస్యకు పరిష్కారం చెప్పిన వేణుస్వామి..

Wait 5 sec.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ప్రస్తుతం ప్రముఖ వ్యక్తుల మధ్య నెలకొన్న విభేదాలు.. ముఖ్యంగా అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న దూరం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాఖీ పండుగ రోజున వైఎస్ జగన్ - షర్మిల, .. రాజకీయాలకతీతంగా ఉండే కుటుంబ సంబంధాలు కూడా ఎలా ప్రభావితమవుతున్నాయో తెలియజేస్తుంది. ఈ సమస్య వెనుక జ్యోతిష్యపరమైన కారణాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి వెల్లడించారు. వారి మధ్య ఈ దూరం పెరగడానికి ‘’ అనే గ్రహాల ప్రభావం కారణమని ఆయన విశ్లేషించారు. షష్టాష్టక దోషం అంటే ఏమిటి..?జ్యోతిష్యం ప్రకారం.. షష్టాష్టక దోషం అనేది ఒకరి జాతకంలో ఒక గ్రహం ఉన్న రాశికి, మరొకరి జాతకంలో అదే గ్రహం ఆరు లేదా ఎనిమిది స్థానాల దూరంలో ఉండటాన్ని సూచిస్తుంది. ఈ దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన లోపించి, తరచుగా ఘర్షణలు, విభేదాలు తలెత్తుతాయి. ఈ ప్రభావం భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు, వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాలపై తీవ్రంగా ఉంటుందని వేణు స్వామి తెలిపారు. కేటీఆర్ - కవిత: కేటీఆర్‌ది శ్రవణ నక్షత్రం, మకర రాశి కాగా, కవితది పునర్వసు నక్షత్రం, మిథున రాశి. ఈ రెండు రాశులు ఒకదానికొకటి ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. దీనివల్ల వారి మధ్య రాజకీయపరమైన, వ్యక్తిగతపరమైన విభేదాలు పెరిగాయి.వైఎస్ జగన్ - షర్మిల: జగన్‌ది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి కాగా, షర్మిలది ఉత్తరాషాడ నక్షత్రం, మకర రాశి. ఈ జాతకాల్లో కూడా షష్టాష్టక దోషం స్పష్టంగా కనిపిస్తుంది. తలెత్తాయని వేణు స్వామి విశ్లేషించారు. ఈ దోషం వల్ల కుటుంబంలో తగాదాలు, వ్యాపారంలో నష్టాలు, వంటి సమస్యలు ఎదురవుతాయని వేణు స్వామి అన్నారు. కాళీ పూజతో సమస్యలకు పరిష్కారం..ఈ షష్టాష్టక దోషం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పారు. ముఖ్యంగా వామాచార పద్ధతిలో చేసే కాళీ పూజ చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన సూచించారు. ఈ పూజ ద్వారా కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. స్మశాన తార పూజ, భగలాముఖి లేదా చిన్నమస్త పూజ వంటివి కూడా ఈ దోష నివారణకు తోడ్పడతాయని అన్నారు. ఈ పూజల వల్ల కుటుంబ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని.. అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు మళ్లీ కలిసి ఉండే అవకాశం ఉంటుందని వేణు స్వామి వివరించారు. సాధారణంగా ఈ పూజలు జ్యోతిష్య నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించడం మంచిదని తెలిపారు. అయితే.. ఈ సూచనలను రాజకీయ నాయకులు ఎంతవరకు పాటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.