తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఉచితంగానే, టీటీడీ మరో కీలక నిర్ణయం

Wait 5 sec.

తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలను యువతకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులకు సూచించారు. టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వాణాధికారి ఛాంబర్‌లో జేఈవో వి వీరబ్రహ్మంతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి కె. రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డా. సి. లత, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.'అన్నమయ్య కీర్తనలపై ప్రాంతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి యువతను భాగస్వామ్యం చేయాలి. తద్వారా అన్నమయ్య కీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లవచ్చు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ వాగ్గేయ కారుడు అన్నమయ్య 14, 973 కీర్తనలను ఆలపించారని, ఇందులో 4,850 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డు చేసి 4,540 కీర్తనలను మాత్రమే అప్ లోడ్ చేశారు.. మిగిలిన కీర్తనలను కూడా సకాలంలో రికార్డ్ చేసి ఉచితంగా భక్త ప్రపంచానికి అందించేలా చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య కీర్తనలను మరింతగా భక్తులకు, ముఖ్యంగా యువతకు అందించి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలి. టీటీడీ నిబంధనల మేరకు నవతరం గాయకులతో అన్నమయ్య కీర్తనలను రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలి. కాలానుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ ద్వారా అన్నమయ్య కీర్తనలను నవతరానికి అందించేందుకు చర్యలు తీసుకోవాలి' అని ఈవో శ్యామలరావు సూచించారు.ఆగష్టు 15న నిర్వహించే 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. జాతీయ జెండా వందనం అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.పవిత్రోత్సవాలు'అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 14 – 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 14న పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు' అని తెలిపారు. 'ఆగష్టు 15న విఘ్నేశ్వరపూజ, యాగశాల పూజ, వేదికార్చన, పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణ, నివేదన, హారతి, లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగష్టు 16న పవిత్ర సమర్పణ, నిత్య పూజ, వేదికార్చన, నిత్య హోమం, పట్టు పవిత్ర పూజ, మహా పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు' అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.