చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు.. ఇలాగైతే నరకానికే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడుపై వైసీపీ అధినేత మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు హాట్‌లైన్‌లో కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలో 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు సమయానికి 12.5శాతం ఓట్లు పెరిగాయన్న వైఎస్ జగన్.. 48 లక్షల ఓట్లు పెరిగాయని ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న కుంభకోణాలు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్ అంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించని కాంగ్రెస్ నేతలు.. తన గురించి మాత్రం మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇదే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రిగా ఉన్నావ్.. నీ జీవితానికి బహుశా ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు.. రామా, కృష్ణా అని అనుకునే వయసులో.. కనీసం ఆ మాటలు అన్నా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది.ఈ మాదిరిగా చేసుకుంటూ పోతే నరకానికే పోతావ్. ఇప్పుడైనా కాస్త మార్పు తెచ్చుకో చంద్రబాబూ" అంటూ వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రజలకు మంచి చేశామనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాలని వైఎస్ జగన్ ఛాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యం కూని చేసి ఎన్నికలు నిర్వహించారన్న వైఎస్ జగన్.. బందిపోటు దొంగల మాదిరిగా వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేశామనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే.. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు. అలాగే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రతి బూత్‌లోని వెబ్ కాస్టింగ్ బయటపెట్టె దైర్యం ఉందా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.