News: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న షాకింగ్ ప్రకటన చేసింది. తాజాగా ఈ బ్యాంకు సర్వీస్ ఛార్జీల్ని సవరించింది. చాలా వాటిపై ఛార్జీలు పెరిగాయి. ఇది ప్రభావితం చేస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇంకొన్నింటిపై నియమ నిబంధనల్ని మార్చింది. ప్రయోజనాల్ని తగ్గించింది. ఇందులో ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ను కూడా తగ్గించడం గమనార్హం. పరిమితి మించి చేసే ట్రాన్సాక్షన్లపై రుసుముల్ని పెంచేసింది. ఇక నెఫ్ట్ (NEFT), RTGS, IMPS ఇలా ఇవి ప్రీమియం అకౌంట్ హోల్డర్లకు, సీనియర్ సిటిజెన్లకు వేర్వేరుగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ మార్పులు సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ఐ అకౌంట్లపై 2025, ఆగస్ట్ 1 నుంచే అమల్లోకి వస్తున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఇటీవలే ఐసీఐసీఐ కూడా కొత్త ఛార్జీల్ని తీసుకొచ్చింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ల సంఖ్యను తాజాగా బ్యాంక్ తగ్గించింది. ఇప్పుడు ఈ బ్యాంక్ కస్టమర్లు 4 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 150 ఛార్జీ చెల్లించాలి. ఇంకా నెలవారీగా నగదు పరిమితి కూడా తగ్గించింది. అప్పుడు అకౌంట్‌కు రూ. 2 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ. 1 లక్షకు తగ్గించింది. దీనిపైన ప్రతి రూ. 1000 పై రూ. 5 ఛార్జీ చేస్తుంది. అంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటివి ఉచిత సర్వీసులుగా ఉండేవి. ఇప్పుడు వీటిపై ఛార్జీల్ని ప్రకటించింది. ఈ సర్వీసులన్నింటిపై ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్లకు రూ. 100, రూ. సీనియర్ సిటిజెన్స్‌కు రూ. 90 ఛార్జీ చేయనుంది. చెక్ రిటర్న్ ఛార్జీలు కూడా మారాయి.ఆర్థిక కారణాలతో చెక్ ఫస్ట్ రిటర్న్‌కు ఈ ఛార్జీ రూ. 500 గా ఉంది. సీనియర్ సిటిజెన్లకు ఇది రూ.450 గా ఉంది. రెండోసారి చెక్ రిటర్న్ అయితే ఛార్జీలు వీరికి వరుసగా రూ. 550, రూ. 500 గా ఉన్నాయి. ఇదే సాంకేతిక కారణాలతో అయితే ఈ ఛార్జీలు రూ. 50, రూ. 45 గా ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ రీజన్స్ అంటే డేట్ మిస్ కావడం, పోస్ట్ డేటెడ్ చెక్స్, సిగ్నేచర్ సరిపోలకపోవడం వంటివన్నమాట.ఇప్పుడు RTGS ఛార్జీల్ని కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సవరించింది. అంతకుముందు రూ. 2 లక్షలు ఆపైన చేసే వాటిపై సాధారణ ప్రజలకు రూ. 15, సీనియర్ సిటిజెన్లకు రూ. 13.50 ఛార్జీ పడేది. ఇప్పుడు ఇది రూ. 2-5 లక్షల మధ్య లావాదేవీలపై వరుసగా రూ. 20, రూ. 18 కి పెంచింది. ఇక రూ. 5 లక్షలు దాటితే వరుసగా రూ. 45, రూ. 40.50 గా ఉంది.NEFT ఛార్జీలు కూడా పెరిగాయి. రూ. 10 వేల వరకు చూస్తే సాధారణ ప్రజలకు రూ. 2, సీనియర్ సిటిజెన్లకు రూ. 1.80 ఛార్జీ పడుతుంది. రూ. 10 వేల నుంచి రూ. లక్ష మధ్య ట్రాన్సాక్షన్లపై వరుసగా రూ. 4, రూ. 3.60 గా ఉంది. రూ. 1 లక్ష- 2 లక్షల వరకు చేస్తే రూ. 14, రూ. 12.60 గా ఉంది. రూ. 2 లక్షలపైన నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై వరుసగా రూ. 24, రూ. 21.60 గా ఉంది.