కొత్తగా బైకులు, కార్లు కొనేవారికి షాక్.. రవాణా శాఖ కీలక నిర్ణయం, జేబుకు చిల్లే..!

Wait 5 sec.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అదనపు భారం మోపింది. వ్యక్తిగత కార్లు, బైకులపై లైఫ్‌ ట్యాక్స్‌ను ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచుతూ తాజాగా రవాణాశాఖ జీవోలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రిజిస్ట్రేషన్ మార్చుకునే పాత వాహనాలకు కూడా ఇదే వర్తిస్తుంది. సర్కార్ నిర్ణయంతో వాహనదారులు జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. కార్లు, జీపులకు కొత్త లైఫ్‌ ట్యాక్స్కొత్త నిబంధనల ప్రకారం, కార్ల ఎక్స్‌షోరూమ్ ధర ఆధారంగా లైఫ్‌ ట్యాక్స్ శ్లాబులను నాలుగు నుంచి ఐదుకు పెంచారు.రూ. 10 లక్షల లోపు ధర ఉన్న కార్లకు ఎటువంటి అదనపు భారం ఉండదు.రూ. 10 లక్షలు దాటితే ఒక శాతం అదనపు ట్యాక్స్.రూ. 20 లక్షలు దాటితే మరో ఒక శాతం అదనపు ట్యాక్స్.రూ. 50 లక్షలు దాటితే అదనంగా రెండు శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.కంపెనీలు, సంస్థల పేరు మీద రిజిస్టర్ చేసే 10 సీట్ల లోపు వాహనాలకు గతంలో ఉన్న 20 శాతం ట్యాక్స్ శ్లాబును రెండుగా విభజించారు. రూ. 20-50 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు 22 శాతంగా, రూ. 50 లక్షలు దాటితే 25 శాతం ట్యాక్స్ విధించారు.ద్విచక్ర వాహనాలపై అదనపు భారంద్విచక్ర వాహనాల విషయంలో.. ఎక్స్‌షోరూమ్ ధర రూ. లక్ష లోపు ఉంటే యథావిధిగా పాత ట్యాక్సే వర్తిస్తుంది. అయితే, ధర రూ. లక్ష దాటితే మూడు శాతం, రూ. రెండు లక్షలు దాటితే ఆరు శాతం లైఫ్‌ ట్యాక్స్ పెరుగుతుంది. ఉదాహరణకు, రూ. 1.10 లక్షల ధర ఉన్న బైక్‌కు గతంలో రూ. 13,200 ట్యాక్స్ ఉండగా.. ఇప్పుడు అది రూ. 16,500కి పెరుగుతుంది. ఇది వాహనదారులకు రూ. 3,300 అదనపు భారం.పెరిగిన ఫ్యాన్సీ నంబర్ల ధరలువాహనదారులకు మరో షాక్ ఇస్తూ.. ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచారు. గతంలో ఉన్న ఐదు శ్లాబులను ఇప్పుడు ఏడుకు పెంచారు. అత్యంత డిమాండ్ ఉండే 9999 నంబర్‌కు గతంలో రూ. 50 వేల కనీస ధర ఉండగా.. ఇప్పుడు దానిని ఏకంగా రూ. 1.50 లక్షలకు పెంచారు. ఇతర ఫ్యాన్సీ నంబర్లకు కూడా కనీస ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు రూ. 1.50 లక్షలు, రూ. 1 లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా ఉన్నాయి.