ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ రైలు.. ఈ రూట్‌లోనే, 12 గంటలు కాదు 9 గంటల్లోనే వెళ్లొచ్చు!

Wait 5 sec.

దేశవ్యాప్తంగా కేంద్రం వందేభారత్ రైళ్లను నడుపుతోంది.. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ వస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య మరికొన్ని వందేభారత్ రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో కూడా మరో రెండు, మూడు నడపాలని ఎంపీల నుంచి కేంద్రానికి రిక్వెస్ట్‌లు వెళ్లాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరు, చెన్నైకు వందేభారత్ రైలు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అంతేకాదు విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా ఖాయమని.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు రెండు నెల క్రితమే ఈ రైలుకు సంబంధించి షెడ్యూల్ కూడా వైరల్ అయ్యిది. జూన్, జులైలో ప్రారంభమవుతుందని భావించారు. అయితే ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని.. త్వరలోనే ఈ రైలు పట్టాలెక్కడం ఖాయమంటున్నారు. వాస్తవానికి విజయవాడ నుంచి బెంగళూరకు రైలు ప్రయాణం దాదాపు 10 నుంచి 12 గంటల పడుతుందని చెబుతుంటారు. విజయవాడ నుంచి బెంగళూరుకు రైలు అందుబాటులోకి వస్తే ఈ రైలు ప్రయాణ సమయం 12 గంటలం నుంచి దాదాపు 8 నుంచి 9 గంటలకు తగ్గుతుంంది. ఈ రైలు బెంగళూరు వెళ్లే వారికే కాకుండా, తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. 'ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉంటాయి. వాటిలో 7 ఏసీ చైర్ కార్ బోగీలు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీ ఉంటుంది. రైలు నెంబర్ 20711 విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత తెనాలికి 5.39 గంటలకు, ఒంగోలు 6.28 గంటలకు, నెల్లూరు 7.43 గంటలకు, తిరుపతి 9.45 గంటలకు, చిత్తూరు 10.27 గంటలకు, కాట్పాడి 11.13 గంటలకు, కృష్ణరాజపురం 1.38 గంటలకు మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుకునేలా ప్లాన్ చేశారు. ' ఈ రైలు (నంబర్ 20712) తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరుతుంది. కృష్ణరాజపురం 2.58 గంటలకు, కాట్పాడి 5.23 గంటలకు, చిత్తూరు 5.49 గంటలకు, తిరుపతి సాయంత్రం 6.55 గంటలకు, నెల్లూరు రాత్రి 8.18 గంటలకు, రాత్రి ఒంగోలు 9.29 గంటలకు, తెనాలి రాత్రి 10.42 గంటలకు, విజయవాడకు రాత్రి 11.45 గంటలకు చేరుకునేలా' ప్లాన్ చేశారంటూ అంటూ చర్చ జరిగింది. ఈ వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు. ఈ రైలు పట్టాలెక్కితే... విజయవాడ నుండి బెంగళూరుకు 9 గంటల్లో, తిరుపతికి నాలుగున్నర గంటల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు.